బాల్యం నుండే ఎందరికో స్ఫూర్తి నింపిన ఉద్దం సింగ్
భారత జాతీయోద్యమ చరిత్రలో అత్యంత దురదృష్టకర, హేయమైన సంఘటనగా జలియన్ వాలాబాగ్ దురాగతం నిలిచిపోయింది. పంజాబీలకు అత్యంత ముఖ్యమైన వైశాఖీ పండగ రోజున వేలాది మంది 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ తోటలో సమావేశమయ్యారు. కానీ, ఇదే వేడుకల్లో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జాతీయోద్యమ నేతలు సైతం పాల్గొన్నారు.
రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ, సత్యపాల్ వంటి నేతలను అరెస్ట్ చేసి, దేశ బహిష్కరణ విధించారు. దీనిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజాందోళనలు నిర్వహించారు. జలియన్ వాలాబాగ్‌లోనూ వారి అరెస్టులను ఖండిస్తూ సంఘీభావం తెలియజేశారు. దాదాపు ఏడెకరాల్లో విస్తరించి ఉన్న ఈ తోట చుట్టూ ఎత్తైన గోడ, అక్కడక్కడ చిన్నచిన్న ద్వారాలు ఉన్నాయి. ఈ సమయంలో బ్రిటిష్ జనరల్ మైఖేల్ ఓ డయ్యర్ పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్నాడు. డయ్యర్ సారథ్యంలోని బ్రిటిష్ సైన్యం ఈ తోటలోకి చొరబడి నిరాయుధులైన జనంపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది.. మొత్తం 50 మంది సైనికులు 10 నిమిషాలు పాటు 1,650 రౌండ్లు కాల్పులు జరిపి నరమేధానికి పాల్పడ్డారు. ప్రవేశ మార్గాలను మూసివేసి, గుమిగూడిన జనంపై గుళ్లవర్షం కురిపించారు. ఈ క్రూరమైన సంఘటనలో వెయ్యిమందికి పైగా చనిపోయారు. ఆ రోజున అక్కడ మంచినీళ్లు సరఫరా చేయడానికి పన్నెండేళ్ల కుర్రాడు వచ్చాడు. జరిగిన దురంతం చూసి చలించిపోయాడు. శవాల గుట్టలను చూసి కోపంతో..కంటినిండా నీరు వస్తుండగా అక్కడ తోటలోని రక్తంతో అంటిన మట్టిని తీసుకుని ఈ అమానవీయమైన ఘటనకు కారణమైన వారిని వదిలిపెట్టనని ప్రతినబూనాడు. ఆ బాలుడు పేరే ఉదమ్ సింగ్.
డయ్యర్ ను చంపడం కోసం భగత్ సింగ్ తో కలిసి విప్లవ కార్యక్రమాలలో పాల్గొంటూ, తుపాకీ కాల్చడం నేర్చుకున్నాడు. ఈ సంఘటన తర్వత డయ్యర్ ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. జనరల్ డయ్యర్ ను చంపేందుకు ఇంగ్లాండ్ వెళ్లాలనుకుంటున్న సమయంలో భగత్ సింగ్ తో పాటు, ఉద్దమ్ సింగ్ ను కూడా అరెస్ట్ చేశారు. అతని కళ్ల ముందే భగత్ సింగ్ ను ఉరితీశారు. ఈ సంఘటనతో మరింతగా విప్లవ జ్వాల రగిలిపోయింది. 1932లో జైలు నుంచి విడుదలయిన తర్వాత ఇంజనీరింగ్ చదవాలి అన్న నెపంతో ఇంగ్లాండ్ కు వెళ్లాలి. అక్కడ రాత్రి పగలు పేరు మార్చుకుంటూ, జనరల్ ఓ డయ్యర్ ను వెతికాడు.
ఒకరోజు ఓ డయ్యర్ ఒక కాన్ఫరెన్స్ కు హాజరుకాబోతున్నట్లు సమాచారం అందిందతనికి. ఎంతో కష్టపడి ఎంట్రీ పాస్ సంపాదించాడు…ఒకపుస్తకంలో ఫిస్టల్ పట్టేటట్లు కాగితాలను కత్తించి అందులో దానిని దాచాడు ఉద్దమ్..ఇంతలో డయ్యర్ ప్రసంగం ముగిసింది…ఆయనను అభినందించాడానికి జనాలు ఆయన దగ్గరకు వెళుతున్నారు. ఆ సమయంలోనే తన దగ్గర ఉన్న పిస్తల్ ను తీసి జనరల్ ఓ డయ్యర్ ను కాల్చి చంపేశాడు. ఇది 1940 జూలై 31 న జరిగింది. ఓ డయ్యర్ ను చంపిన తరువాత ‘ఈయనను చంపడానికే నేను ఇన్నిరోజులు బతికాను.ఇంక నన్ను ఏమైనా చేసుకోండి’ అంటూ లొంగిపోయాడు. దాంతో 1940 జులై 31 బ్రిటిష్ ప్రభుత్వం లండన్‌లో ఉరితీసింది. జలియన్ వాలాబాగ్ మారణకాండకు ప్రతీకారం తీర్చుకున్న ఉద్దమ్ సింగ్ జీవితం తర్వాత స్వంతంత్ర్య సంగ్రామంలో ఎందరోమందికి స్పూర్తినిచ్చింది.