ఉగాది
‘ఉగాది’ అన్న తెలుగు మాట ‘‘యుగాది’’ అన్న సంస్కృత పద రూపం. ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్తకల్పంతో బ్రహ్మ సృష్టిని ఆరంభించిన రోజు. దీనికి ఆధారం ‘‘సూర్య సిద్ధాం తం’’ అనే ఖగోళ జ్యోతిష గ్రంథంలోని శ్లోకం.
‘‘చైత్రమాస జగత్ప్బ్రహ్మ సవర్ణ పథమే అహని వత్సరాదౌ వసంతాదౌ రసరాధ్యే తడైవచ’’- అంటే బ్రహ్మ కల్పం ఆరంభమే మొదటి యుగాది. మొదటి సంవత్సరం (ప్రభవ)లో మొదటి మాసం (చైత్ర మాసం), మొదటి తిథి అయిన పాడ్యమి, మొదటి రోజైన ఆదివారం నాడు బ్రహ్మ యావత్తు సృష్టిని ప్రభవింపచేశాడని అర్థం. అందుకే మొదటి సంవత్సరానికి ‘‘ప్రభవ’’ అని పేరు. అలాగే చైత్ర మాసం శుక్ల పక్షంలో సూర్యోదయ సమయానికి పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాదిగా నిర్ణయించ బడిరది. ఈ పండుగను మహరాష్ట్రలో ‘‘గుడి పడ్వా’’ తమిళులు ‘‘పుథాండు’’ మళయాళీలు ‘‘విషు’’ సిబ్బులు ‘‘బైశాఖి’’ బెంగాళీలు ‘‘పొహెలా బైశాక్’’ పేర్లతో పండుగ జరుపుకుంటారు. శ్రీరామ చంద్రుడు రాజ్యభిషేకం, విదేశీ శక్తులపై విజయం సాధించిన తర్వాత విక్రమాదిత్యుడు నూతన శకం ప్రారంభించినది ఉగాది పర్వదినం నాడే. మహర్షి దయానంద సరస్వతి ఆర్యసమాజ స్థాపన చేసింది ఈ రోజే. హిందూ రాష్ట్ర నవోదయానికి నాందీ వాచకుల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు స్థాపకులు పరమ పూజనీయ డాక్టర్ కేశవరావ్ బలీరాం హెడ్గేవార్ జన్మించినది ఉగాది నాడే.