UGC నిబంధనలపై స్పష్టతనిచ్చి, గందరగోళానికి తెర దించండి : ABVP

యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (UGC) విడుదల చేసిన 2026 కొత్త నోటిఫికేషన్ ను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్వాగతించింది. అలాగే ప్రశంసించింది కూడా. కానీ.. ఈ నిబంధనలలో స్పష్టత, సమతౌల్యత కూడా ముఖ్యమేనని నొక్కి చెప్పింది. యూజీసీతో సహా అన్ని సంస్థలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఉన్నతంగా నిలబెట్టాలని, ప్రతి పౌరుడికి సమాన హక్కులు వుండేలా, వివక్ష లేని సమాజంగా తీర్చడానికి అన్ని విద్యా సంస్థలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టాలని కోరింది.
విద్యా సంస్థల ప్రాంగణంలో సానుకూల, సమానత్వ వాతావరణం కోసం ఏబీవీపీ ఎల్లప్పుడూ కృషి చేస్తూనే వుంటుందని, ప్రజాస్వామ్య విలువలను ప్రోత్సహించడానికి ఈ నిబంధనలు వున్నాయని విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అభివృద్ధి చెందిన భారత్ అన్న దానిని సాకారం చేసుకోవడానికి మనమందరమూ కృషి చేయాలని ఏబీవీపీ పిలుపునిచ్చింది.
అయితే.. ఈ కొత్త నొటిఫికేషన్ కి సంబంధించిన నిబంధనలు, పరిభాషకు సంబంధించి విద్యార్థులలో, తల్లిదండ్రులలో వున్న అస్పష్టత, గందరగోళాన్ని తొలగించడానికి యూజీసీ తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా ఏబీవీపీ డిమాండ్ చేసింది. అలాగే విపత్కర పరిస్థితులు తలెత్తకుండా, వాటిని నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రస్తుతం ఇది కోర్టులో పెండింగ్ లో వుందని, దీనిపై తన వైఖరిని స్పష్టం చేస్తూ యూజీసీ వెంటనే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది.
మరో వైపు ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీరేంద్ర సింగ్ సోలంకి మాట్లాడుతూ.. విద్యా ప్రాంగణాల్లో సామరస్యం, సమానత్వం కోసం అవసరమని, దీని కోసం తాము ఎప్పుడూ కృషి చేస్తూనే వుంటామని ప్రకటించారు. క్యాంపస్ లలో అన్ని వర్గాలకు సామాజిక సమానత్వం వుండాలని, క్యాంపస్ లలో ఎలాంటి వివక్షతకు చోటు వుండకూడదన్నారు. దీనిపై తల్లిదండ్రులలో, విద్యార్థులలో గందరగోళం వుందని, దీనిపై యూజీసీ వెంటనే వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
విద్యా సంస్థల ప్రాంగణంలో సానుకూల, సమానత్వ వాతావరణం కోసం ఏబీవీపీ ఎల్లప్పుడూ కృషి చేస్తూనే వుంటుందని, ప్రజాస్వామ్య విలువలను ప్రోత్సహించడానికి ఈ నిబంధనలు సవరించింది. ఈ నిబంధనలో నాలుగు కీలక ఆదేశాలున్నాయి.
ప్రతి విశ్వవిద్యాలయంలో లేదా కళాశాలలో ఈక్విటీ కమిటీలు, ఈక్విటీ స్క్వాడ్ ఏర్పాటు.
అన్ని సంస్థలలో 24×7 హెల్ప్ లైన్, ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు సంస్థలో సురక్షిత వాతావరణం కల్పించబడుతుంది.
నిబంధనలను ఉల్లంఘించే వారి గుర్తు రద్దవుతుంది లేదా నిధులు ఆపేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *