34 సంవత్సరాల తర్వాత జమ్మూలో తెరుచుకున్న అమ్మవారి ఆలయం… అమ్మవారు తపస్సు చేసింది ఇక్కడే
దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్ ఒకప్పుడు ఇస్లామిక్ ఉగ్రవాదానికి కంచుకోటగా వుండేది. 1990లో ఉగ్రవాదం కారణంగా స్థానిక హిందువులు వలస వెళ్లిపోయారు. దీంతో అక్కడ వున్న ఆలయం భగవతి ఉమాదేవి ఆలయం మూతపడిరది. అంతేకాకుండా అక్కడ జరిగిన హింసలో ఈ ఆలయానికి నిప్పుకూడా పెట్టారు. దీంతో 2010 వరకూ శిథిలావస్థలోనే వుంది. అంతేకాకుండా యాత్రికుల కోసం నివాస క్షేత్రాలు కూడా వున్నాయి. అయితే.. ఇవి కూడా ఇస్లామిక్ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా వుండేది.
ఇంత జరిగిన తర్వాత ఈ ఆలయాన్ని తిరిగి తెరిచారు. ఈ సందర్భంగా అమ్మఆరి విగ్రహాన్ని రాజస్థాన్ నుంచి తెప్పించారు. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమక్షంలో ఆలయంలో పూజలు జరిగాయి. 34 సంవత్సరాల తర్వాత అమ్మవారి ఆలయం తెరుచుకోవడంతో హిందువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత తమ మనస్సులు ప్రశాంతంగా మారాయని, ఇలా ఆలయన్ని పునరుద్ధరించడం అత్యంత ఆనంద దాయకమన్నారు. కశ్మీర్‌లోని అన్ని ఆలయాలు కూడా ఇలా సాధారణ స్థితికి పునరుద్ధరణ చేసుకోవాల్సిన అవసరం వుందని హిందువులు అంటున్నారు.
అయితే.. ఈ అమ్మవారి ఆలయానికి కూడా అత్యంత పురాతన చరిత్ర వుంది. ఉమా భగవతి దేవి ఆలయ చరిత్ర సత్యయుగానికి సంబంధించింది. అమ్మవారు ఒక సమయంలో సదాశివుడికి అర్ధాంగి కావాలని అనుకున్నది. తన తల్లి మీనా నుంచి అనుమతి తీసుకొని, షాంగాస్ ప్రాంతంలో తపస్సుకు కూర్చుంది. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి ఉమా నగరి అని పేరు వచ్చింది. అమ్మవారు ఇక్కడే తపస్సు చేసింది కాబట్టి.. ఇక్కడ ఆలయం నిర్మాణమైంది. ఈ ఆలయానికి ఉమా భగవతీ దేవి ఆలయం అని పేరు వచ్చింది.