హోల్కర్ జయంతి సందర్భంగా సమరసతా వేదిక ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ
పుణ్యశ్లోకి అహిల్యాబాయి హోల్కర్ జయంతి సందర్భంగా సామాజిక సమరసతా వేదిక కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ చేశారు. పాదరక్షలు కుట్టే ‘‘మోచి’’ వర్గీయులకు వీటిని పంపిణీ చేశారు. ఎండ సమయంలో, వానల సమయంలో వీరు రోడ్లపైనే కూర్చొని, తమ పనిని చేస్తున్నారని, అందుకోసమే ఎండ, వానల నుంచి రక్షణ కోసం అహల్యాబాయి హోల్కర్ జయంతి సందర్భంగా గొడుగులను పంపిణీ చేశామని నిర్వాహకులు పేర్కొన్నారు. చెప్పులు కుడితే గానీ.. జీవనం గడవదు. అవసరాలు తీరవు. అందుకే సంత్ రవిదాస్ వంశీకులైన ఈ చర్మకారులకు,మోచి వారికి,ఉడతా భక్తిగా ఒక ఛత్రీ అందించాలని సామాజిక సమరసతా వేదిక కరీంనగర్ కార్యకర్తలు నిర్ణయించారు. ఈ గొడుగులు పొందిన వారి పేర్లివీ….
1.దొంతుల మల్లేశం ,
2.దేవరకొండ లావణ్య,
3.కానుకుర్తి కాంతమ్మ ,
4.చంద్రగిరి అనిల్,
5.చంద్రగిరి సందీప్
మరోవైపు పుణ్యశ్లోకి అహిల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది ఉత్సవాల సందర్భంగా కూడా సామాజిక సమరసత వేదిక పలు కార్యక్రమాలను నిర్వహించింది. ఆ కార్యక్రమాల ద్వారా ఈ హైందవ సమాజానికి హోల్కర్ చేసిన సేవలను గుర్తు చేశారు. కుటుంబ సమ్మేళనాలు, మహిళా సమ్మేళనాలు, భజన మండళ్లతో సమావేశాలు, పిల్లలకు చిత్రలేఖన పోటీలను కూడా నిర్వహించారు. ఇందులో భాగంగానే అహిల్యాబాయి హోల్కర్ జయంతి సందర్భంగా గొడుగుల పంపిణీ చేశారు.