ఇంకుడు గుంత కాదు…. ఇంకుడు బోరు… అతి తక్కువ ఖర్చు తో రైతులకు మేలు
భూగర్భ జలాలు బాగా ఇంకిపోతున్నాయి. రానూ రానూ నీటి సమస్య కూడా తీవ్రం కాసాగింది. ఈ నేపథ్యంలో సహజంగానే ఇంకుడు గుంతల వైపు దృష్టి వస్తుంది. కానీ… నెల్లూరుకి చెందిన శాస్త్రవేత్త జగదీష్ వినూత్న ఆలోచన చేశారు. వర్షపు నీటిని భూగర్భంలో ఇంకింపజేసుకోవడానికి ‘‘ఇంకుడు బోరు’’ పేరుతో కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. తన మామిడి వ్యవసాయ క్షేత్రంలో ఈ ఇంకుడు బోరును ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసి, మంచి ఫలితాలు సాధించారు.
కావల్సినవి ఇవీ… ఏర్పాటు చేసుకునే విధానమిదీ…
పీవీసీ పైపు, మెష్, గరాట, కొంచం ఇసఱక, గులకరాళ్లు. పీవీసస పైపుకు చుట్టూ అంగుళం వెడల్పు వుండే బెజ్జాలు పెట్టాలి. గుంత ఎంత లోతు తీసవ్తమో, అంత పొడవు పైపు వాదాలి. ఇంకుడు బోరు 6 అడుగుల నుంచి 50 అడుగుల వరకు లోతు పెట్టుకోవచ్చు. అంతకన్నా లోతు చేయకూడదు. పైపు ఒక చివరన అడుగు ఎత్తున పైపును వదిలేసస, మిగితా పైపుకు మాత్రమే బెజ్జాలు పెట్టాలి. దీని చుట్టూ ఫైబర్ మెషషను చుట్టాలి. రెండు పొరలుగా చుడితే బాగుంటుంది. ఎందుకంటే వాన నీటితో పాటు మట్టి రేణువులు, సన్నని ఇసఱక లోపలికి వెళ్లకుండా ఈ మెషష ఆపుతుంది. భూమి లోపలికి నిలువుగా హేండ్ బోరుతో గుంత తవ్వాలి. ఆ గుంతలో అడుగున అర అడుగు ఎత్తులో గులకరాళ్లు వేయాలి. ఆ తర్వాత బెజ్జాలు వేసస, మెషష చుట్టి ససద్ధం చేసఱకున్న పైపును దింపాలి. దాని చుట్టూ ఇసఱక, గులకరాళ్లు వేసస పూడ్చేయాలి.
నీటి లభ్యత బట్టి 6 అడుగుల నుంచి 50 అడుగుల రకు ఎంత లోతు అవసరం అనుకుంటే అంత లోతున్న ఇంకుడు బోరును మనం ఏర్పాటు చేసుకోవాలి. లోతు పెరిగినా కొద్దీ పైపు వ్యాసం, పొడవుతో పాటు దాని పైన అమర్చే గరాటా సైజు కూడా పెంచుకుంటూ పోవాలి. అయితే… ఈ పద్ధతి ఎక్కువగా సన్న, చిన్నకారు రైతులకు మేలుగా వుంటుంది.
ఇంకుడు గుంటకి కొన్ని చదరపు మీటర్ల చోటును తీసుకుంటుంది. కానీ… ఇంకుడు బోరుకి మాత్రం కేవలం ఒక చదరపు మీటరు చోటు మాత్రమే సరిపోతుందట. భూమి లోపలికి నిలువుగా బోరు గుంత తవ్వి, అందులోకి పీవీసీ పైపును దింపాలి. దాని పైన ఓ గరాటాను అమర్చాలి. దీనినే ఇంకుడు బోరు అంటారు. భూమి లోపలకు నిలువుగా దింపే పీవీసీ పైపు ద్వారా వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది.వర్షపాతాన్ని బట్టి ఎంతో కొంత వర్షపు నీరు గరాటా ద్వారా కూడా భూమి లోపలికి ఇంకుతుంది. దీనిని పొలాల్లోను, బోరు బావి దగ్గర కూడా ఉపయోగించుకోవచ్చు.