పులిసిన దేశీ ఆవు మూత్రం సస్య రక్షణకు ఉపయోగకారి
పులిసిన దేశీ ఆవు మూత్రాన్ని సస్య రక్షణకు ఉపయోగకారిగా వుంటుంది. కీటకాలను చంపడానికి మురబెట్టిన దేశీ ఆవు మూత్రం పనికొస్తుంది. అయితే దీనిని రాగి పాత్రలో మురగబెట్టాలి. సేంద్రీయ పద్ధతిలో వుండే రైతులు ఎప్పటి నుంచో వినియోగిస్తున్నారు. మొదటగా సేకరించిన దేశీ ఆవు మూత్రాన్ని ఓ పాత్రలో వడగట్టాలి. వడబోసిన దేశీ ఆవు మూత్రాన్ని రాగి పాత్రలోకి తీసుకొని, పులియనివ్వాలి. ఈ విధంగా 5 రోజుల పాటు పులియబెట్టాలి. ఇలా చేస్తే శ్రేష్ఠమైన సస్యరక్షణ ద్రావణంగా పనిచేస్తుంది. కీటకాలు, పురుగులు లేకుండా చేస్తుంది. ఇలా పులియబెట్టిన దేశీ ఆవు మూత్రాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి అన్ని పంటలపై పిచికారీ చేయవచ్చు. దీంతో పురుగులు రాకుండా నివారిస్తుంది. సేంద్రీయ పద్ధతిలో ఇది మహత్తరమైన ప్రయోగంగా చెబుతుంటారు. ఇలా ఆవు మూత్రాన్ని పిచికారిగా వాడటం వల్ల పంట దిగుబడి కూడా పెరుగుతుందని అంటుంటారు. విత్తనాల ద్వారా పంటలకు వచ్చే వ్యాధులను కూడా అరికట్టవచ్చు. అంతేకాకుండా నేల సరానికి కూడా హాని కలిగించదు. మరియు పంటలను పాడుచేసశీ తెగుళ్ల నుంచి కూడా కాపాడుతుంది.