శరీరంలోని కొవ్వును తగ్గించే మెంతులు

మెంతులతో వాత కఫములు శమింపజేయును. ఆకలిని బాగా పుట్టిస్తుంది. మెంతికూర ఆకుకూరగా కూడా మనం ఉపయోగించుకుంటాం. కడుపు ఉబ్బరమును, గ్యాసును పూర్తిగా మెంతులు నివారింతును. ఆకలిని బాగా పెంచుతాయి. శ్వాసకోశ సంబంధ వ్యాధులను తగ్గించును. మెంతి ఆకును మెత్తగా నూరి కొద్దిగా నూనె కలిపి ఉడికిస్తే, పట్టివేసిన గడ్డలు పక్వమై, పూర్తిగా పగిలిపోతాయి. మెంతి ఆకును ఉడికించి, నెయ్యిలో వేయించి, అందులో కొద్దిగా మిరియాలు, ఉప్పు కలిపి తీసుకుంటే మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి తగ్గి పోతుంది. అలాగే గోధుమ రవ్వలో మెంతికూర మిరియాలు, పాలు, నెయ్యి, చక్కెర కలిపి పాయసం లాగా తీసుకుంటే శరీరానికి పుష్టినిస్తుంది.

 

మెంతికూరను నూరి ముద్దగా చేసి, తేనె కలిపి తీసుకుంటే… సుఖ విరేచనాలు అవుతాయి. అలాగే మూల శంకను, దగ్గును కూడా తగ్గిస్తుంది. ప్రేగుల్లో పుండ్లు అయితే.. తగ్గిస్తుంది. మెంతులు అజీర్న విరేచనాలు, జిగట విరేచనాలను కూడా తగ్గిస్తుంది. ఒక చెంచా మెంతులు పొడిచేసి, ఒక గ్లాసు మజ్జిగతో రోజుకు మూడు లేదా నాలుగు సార్లు తీసుకుంటే జిగట విరేచనాలు, వేడి తగ్గిపోతుంది. మూత్రంలో మంట తగ్గి, మూత్ర విసర్జన బాగా జరుగుతుంది. రోజూ 25 గ్రాముల మెంతుల పొడి, రెండు పూటల్లో భోజనం తర్వాత తీసుకుంటే మధుమేహ వ్యాధి తగ్గిపోవును. మజ్జిగతో కలిపి తీసుకుంటే శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. సన్నబడతారు కూడా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *