ఆవు పేడ 20 కోట్ల మంది అవసరాలను తీరుస్తుంది… ఆవు కదిలే శక్తి కేంద్రం

మన దేశంలో గ్యాస్  మరియు విద్యుత్‌ కొరత చాలానే వుంది. సోలార్  పవర్‌ కొంత కొరత తీరుస్తున్న … అందరికీ అందుబాటులోకి రావడానికి కాససత సమయం పడుతుంది. మనవద్ద లభించే తక్కువ ఖరీదు సాధనాల ద్వారా  కాక… భారీ వ్యయంతో కూడిన సాధనల  ద్వారా గ్యాస్  నేడు మనం ఉత్పత్తి చేసుకున్తున్నాం . 19 కిలోల గ్యాస్  సిలిందర్  ఈ రోజున మార్కెట్‌లో 1000 రూపాయలకు పైమాటే. ఇది ముందు ముందు మరింత పెరగనూ వచ్చు. పెద్ద పెద్ద ఆనకట్టలు కట్టి జల విద్యుత్తును, డీజీలు లేదా బొగ్గు విపరీతంగా వాడి థర్మల్‌ విద్యుత్తును ఉత్పత్తి చేసుకున్తున్నాం. . ఇంత చేససనా మన అవసరాలకిది సరిపోవడం లేదు. సరికదా కొన్ని ప్రమాదాలు కూడా వాటిలో పొంచి వున్నాయి. జలవిద్యుత్‌ కేంద్రాల వద్ద గల ఆనకట్టలు కూలిపోతాయేమోనని, దానివల్ల అపార నష్టం  సంభావిస్తున్దేమోనని  భయం ఎప్పుడూ వుండనే వుంది. ఆనకట్ట వద్ద పూడికలు, మట్టి పెరిగిపోవడం మరో సమస్య. థర్మల్‌ విద్యుత్తుకు అవసరమైన ముడి పదార్థాలు మనవద్ద అంతంత మాత్రంగానే వున్నాయి.

విదేశీ భావదాస్యంలో మునిగిన మనం మనదైన గోవంశం అందించే గోమయం., గోమూత్రంలోని అద్భుత శక్తిని అవహేళన చేశాం. గోమయం చేత గ్యాస్  ఉత్పత్తిని భారీగా చేపట్టవచ్చు. అలా బయటికి వచ్చే మడ్డి పదార్థం ఎంతో విలువైన సేంద్రీయ  ఎరువుగా పంటలకు ఉపయోగించవచ్చు. మన ఆర్థిక వ్యవససథకు తగినట్లు గోవంశాన్ని మనం సరియిన  పద్ధతిలో ఉపయోగించుకోకపోగా… వాటిని చంపేసీ  మాంసం ఎగుమతి చేసి డబ్బు సంపాదించే వ్యాపారంలో పడ్డాం. గోమయ, గోమూత్రాలతో గ్యాస్  ఉత్పత్తిని ప్రారంభిసశ్తీ దాని వల్ల ఎంతో వంట చెరుకు, పిడకలు మిగిలిపోతాయి.
అహ్మదాబాద్‌ సమీపంలోని ఈడర్‌లో గోబర్‌ గ్యాస్ తో  కిర్లోస్కర్‌ ఇంజన్‌ను కలిపి విద్యుత్తు ఉత్పత్తి జరుగుతున్నది. అలా చిన్న చిన్న యూనిట్లు అంటే గ్రామ గ్రామాలలో ఇలాంటి ఉత్పత్తి చేపట్టి లేదా గోశాలలు `గోసదనాలు “పశుకేంద్రాలు వున్న చోట్లలో ఇలాంటి ప్రయత్నాలు చేసస గ్రామీణ భాగంలో విద్యుత్‌ అవసరాలకు చాలా వరకు పూర్తిచేయవచ్చు. భారీయంత్ర సవమాగ్రితో హైడ్రో యూనిట్లను, థర్మల్‌ యూనిట్లను నెలకొల్పే బదులు చిన్న చిన్న యూనిట్లతో ఈ ఉత్పత్తిని పెంచడం నేటి అవసరం. ఇది సులభంగా, తక్కువ ఖర్చుతోను జరిగే పని. ఏ ప్రమాదాలు లేని పని. సమాజం ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయంసమృద్ధి“సాధించ గలిగిన  పని.

ఒక్క గ్యాసు ప్లాంటులో 10 కిలోల పేడతో 12 ఘనపుటడుగుల గ్యాసు లభిస్తుంది. కొత్తగా వచ్చిన గ్యాసు వంట పొయ్యిలపైన ఒక వ్యక్తికి అవసరమైన వంటకు 6 ఘనపు అడుగుల గ్యాసు సరిపోతుంది. పశువుల అన్నిటి పేడ ఈ విధంగా గ్యాసుగా మార్చగలిగితే అది 60 కోట్ల మంది అవసరాలకూ సరిపోతుంది. పట్టణాల్లో నేడు లభిస్తున్న గ్యాసు క్రూడాయిల్‌ ద్వారా తయారవుతున్నది. ఆయిల్‌ ధరలు పెరిగిపోతున్నాయి. మరోపక్క గ్యాసు యొక్క డిమాండ్‌ ఎప్పటికప్పుడు పెరుగుతూనే వుంది. పశువులు గడ్డి, ఆకులు, అలములు మేసి పేడను అంఇస్తాయి. పేడతో గోబర్‌ గ్యాసుప్లాంట్లు, వాటివల్ల విద్యుత్తు లభిస్తుంది. ఈ దృష్టితోనైనా పశువులు రక్షించబడతాయి. చెట్లు నరకడం మానితే వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. ప్రజలకు దానివల్ల ఆరోగ్యం లభిస్తుంది.

గోసంతతి అంతా పనికిరావనుకునే పశువులు సైతం పేడనయితే తప్పక ఇస్తాయి. గ్యాసు ప్లాంట్లలో పేడ మురిగినట్లే, ఎరువు గుంతలలో ఆకులు అలములతో కలిసి పేడ అక్కడా మురుగుతుంది. భేదమిటంటే ఎరువు గుంతలలో ప్రాణవాయువుతో కలిసి అది మురుగుతుంది. అందులో నుంచి కార్బన్‌డైఆక్సైడ్‌ వెలువడుతుంది. గ్యాసు యంత్రాలలో ప్రాణ వాయువు లేకుండానే మురిగి గుంతలలోని ఎరువు కంటే రెట్టింపు నైట్రోజన్‌ కలిగి వుంటుంది. పంట రాబడిని పెంచడంలో నైట్రోజన్‌ పాత్ర ఎంతో వుంది. నైట్రోజన్‌ కంటే కూడా ‘హ్యుమస్‌’ పాత్ర గొప్పది. ఎందుకంటే అది భూమిలో జీవాణువులను సుసమృద్ధం చేస్తుంది. గ్యాసు ప్లాంట్ల నుంచి వెలువడే మడ్డిలో ఈ ‘హ్యుమస్‌’ ఎక్కువ వుండటం వల్ల అలా లభించిన ఎరువు అత్యంత ఉపయోగకారి.

ప్రతి పశువు సరాసరి 10 కిలోల పేడ ఇస్తుంది. దీనిలో కొంత పెంటకుప్పలో పడి ఎరువవుతుంది. సుమారు మూడో భాగం పిడకల తయారీకి ఉపయోగపడి, అవి ఆ రూపంలో కాల్చబడతాయి. అయితే అలా కాల్చబడిన పిడకల వేడిలో కేవల 13 శాతం మాత్రమే ఉపయోగం అవుతుంది. మిగిలిన వేడి వ్యర్థంగానే పోతుంది. కాని గ్యాసు పొయ్యిల ద్వారా ఉత్పత్తి కాబడే వేడిమి 60 శాతం వరకు ఉపయోగానికి వస్తుంది. పెంటకుప్పలో 1శాతం మాత్రమే గ్యాసుప్లాంటు మడ్డి ఎరువులో 2శాతం నైట్రోజన్‌ వుంటుంది. దేశంలో లభించే మొత్తం గోమూత్రం, గోమయం ఉపయోగించగలిగితే ఎంతో ఎక్కువ మొత్తంలో సేంద్రియ ఎరువు, వంటగ్యాసు ఉత్పత్తి చేసి దేశం అవసరాలకు చాలా వరకు పూర్తి చేయగలుగుతాం. 24 కోట్ల పశువుల వల్ల ప్రతి రోజూ కనీసం 25 లక్షల టన్నుల పేడ వస్తుంది. 25 కిలోల పేడతో 1 ఘనపు మీటరు గ్యాసు చొప్పున ప్రతి రోజు 10 కోట్ల ఘనపు మీటర్ల గ్యాసు లభిస్తుంది. ఇది 20 కోట్ల మంది అవసరాలకు సరిపోతుంది. దీని వల్ల బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆయిల్‌, కిరోసిన్‌ భారం ఎంతో తగ్గిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *