బెల్లం తో కఫ, పిత్త రోగాలు దూరం
బెల్లం చెరుకు రసం నుండి తయారు చేయబడును. శుద్ధమైన బెల్లం వాతహరము. రక్తాన్ని వృద్ధి చేయును. మూత్ర విసర్జన బాగా జరిగేట్లు చేయును.పాత బెల్లం మిక్కిలి పథ్యం. బెల్లాన్ని అల్లంతో కలిపి తింటే కఫ రోగాలు, కరక్కాయతో కలిపి తింటే పిత్త రోగాలు, శొంఠితో కలిపి తింటే వాత రోగాలు పోతాయి. అనేక వ్యాధులను న యింపచేయడానికి దీనిని అనుపానముగా వాడతారు. ఆయుర్వేద ఔషధములను బెల్లముతో లేహ్యంగా, అరిష్టముగా, పానకముగా తయారు చేయును.
ఆహారంలో కూడా బెల్లాన్ని బాగా వాడతారు. చెరుకు రసం నుంచి తయారైన పటిక బెల్లం, శర్కర కూడా వాతపిత్త రోగాలను హరించివేయును. కఫమును వృద్ధి చేయును. కళ్లకు బెల్లం చాలా మంచిది. ఇవిగాక తాటి చెట్టు నుంచి తయారు అయిన బెల్లాన్ని తాటి బెల్లం అంటారు. దగ్గు, ఆస్తమా వ్యాధులకు బాగా పనిచేయును. రాత్రి బెల్లం ముక్క తీసుకుంటే గ్యాస్, అజీర్ణం దూరమవుతాయి. చలికాలంలో తరుచుగా జలుబు, దగ్గు వస్తే.. బెల్లం తీసుకోవాలి. అలాగే మలబద్ధకాన్ని కూడా దూరం చేస్తుంది.