విజయవంతమవుతున్న వాక్సినేషన్‌

ఏడిదిన్న క్రితం భారత్‌లోనూ సంక్రమిత వ్యాధిగా ప్రవేశించిన మహమ్మారి ‘కరోనా’ తీవ్రత క్రమంగా తగ్గుతోంది. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరు పెరుగింది. ఇప్పటికే 80 కోట్ల మందికి మొదటి దశ వ్యాక్సినేషన్‌ పూర్తయింది. అనుకున్నవిధంగా డిసెంబర్‌ 2021 నాటికి దేశమంతా వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే అవకాశముంది. పిఎమ్‌ కేర్స్‌ నిధి ద్వారా వ్యాక్సినేషన్‌ కోసం 2200 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ప్రపంచ జనాభాలో భారత్‌ది రెండవస్థానం. కాని కరోనా మరణాల్లో దేశ జనాభా నిష్పత్తిలో 12వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 45.5 లక్షల మంది చనిపోతే భారత్‌లో 4్హ లక్షల మంది చని పోయారు. 33 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో 7 లక్షల మంది చనిపోయారు.

సెకండ్‌వేవ్‌ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థలో పనిచేస్తున్న సీనియర్‌ శాస్త్రవేత్త, భారత సంతటికి చెందిన సౌమ్య స్వామినాథన్‌ ‘భారత్‌లో కోట్ల మంది  చనిపోయారని, లాక్‌డౌన్‌ తప్పనిసరి అని’ చెప్పినట్లు వార్తలొచ్చాయి. డాక్టర్లు, శాస్త్ర వేత్తలు, కరోనా వేరియంట్ల గురించి చాలా మాట్లాడారు. కాని భారత్‌లో ఉన్న ప్రత్యేక పరిస్థితి ఎవరికీ అర్థం కాలేదు. ఏప్రిల్‌ 2021లో 2% ఉన్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చొరవతో 5 నెలల్లో 80%కి చెరింది. వ్యాక్సినేషన్‌తోనే కరోనాని అదుపు చేయలేమని సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. కాని వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రగతి చెందుతున్న కొద్దీ జనంలో భయం తగ్గింది. వ్యాక్సినేషన్‌ వేయించుకునే విషయంలో, కోవిడ్‌ నిబంధనలు పాటించే విషయంలో ఫోన్‌లో కాలర్‌టోన్‌ ఇవ్వడం నుంచి సమయానుసారంగా ప్రధాని మోదీ కూడా కరోనా గురించి, నిబంధనలు పాటించడం గురించి ఎన్నోసార్లు ప్రజలనుద్దేశించి చెబుతూనే ఉన్నారు. అసలు 9 నెలల్లోనే భారత్‌లో వ్యాక్సిన్‌ తయారీకి ప్రధాని తీసుకున్న చొరవ, ఆత్మనిర్భర భారత్‌ పేర ఆయన ఇచ్చిన నినాదాన్ని నిజం చేసింది. మీడియా, ప్రతిపక్షాలు కేంద్రం మీద ఎంతో బురద జల్లే ప్రయత్నం చేసినా పూర్తిగా కేంద్రం తమ పరిధిలో ఉంచుకొని వ్యాక్సిన్‌ సరఫరా ప్రక్రియను కొనసాగిస్తున్నది.

తెలంగాణా ప్రభుత్వం కూడా వ్యాక్సిన్‌ తయారీదారులెవరూ కేంద్రం మాట కాదని ముందుకు రాలేదు. సుప్రీంకోర్టులో సైతం కేంద్రం పూర్తి విశ్వాసంతో తాము మాత్రమే ఈ సరఫరా ప్రణాళికా బద్దంగా నిపుణుల సూచన మేరకు కొనసాగిస్తామని చెప్పింది. అదే చిత్తశుద్ధితో ఈ ‘ఆరోగ్యయజ్ఞం’ కొనసాగుతున్నది. ‘ఉప ఎన్నికలు కొన్ని రోజులు వాయిదా వేయలేరా’ అంటూ కొందరు మేధావులు ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలను ఆపడం రాజ్యాంగ బద్ధం కాదని వీరికి తెలయదా? వ్యాక్సినేషన్‌ జోరందుకోని సమయంలో కొన్ని లక్షల డోసులు విదేశాలకు పంపినమాట వాస్తవం.

కాని ఆ వేగం కొనసాగించాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని లక్షల డోసులు ఇక్కడ వృధా చేయలేదు? సెకండ్‌వేవ్‌ తరువాత వ్యాక్సినేషన్‌ వేగం అందుకుంది. ఇప్పుడు అనేక పరిశ్రమలు వ్యాక్సిన్‌ తయారికి ముందుకొచ్చాయి. వ్యాక్సిన్‌ లభ్యత పెరిగింది. మెడికల్‌ షాపుల్లో కూడా ఇప్పుడు వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. సిసిఎంబి జరిపిన ఓ సర్వేలో దేశంలో సగం మందికి కరోనా వచ్చి పోయిందని తెలిసింది. అది వాస్తవం కావచ్చు. అయినా భారత్‌లో మరణాలు సంభవించలేదు. కారణం భారతదేశంలో మనం తీసుకునే ఆహారం, పాటించే వైద్య విధానాలు సహజసిద్ధంగా రోగనిరోధక శక్తిని అందించేవే అని అర్థం చేసుకోవాలి. అమెరికాను నేటికీ డెల్టా వేరియంట్‌ వేధిస్తూనే ఉంది. అమెరికా కంటె ముందు వరుసలో భారత్‌లో వ్యాక్సినేషన్‌ సాగుతున్నది.

– హనుమత్‌ప్రసాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *