వనవాసీ కుటుంబాల ఘర్‌వాపసీ

ఎన్నో ఏళ్ళ కిందట మిషనరీల మాయాజాలం వల్ల క్రైస్తవ మతంలోకి మారిన అమాయక వనవాసీ కుటుంబాలు సనాతన హిందూధర్మ విశిష్టతను గ్రహించి తిరిగివచ్చాయి. ఒడిశాలోని కియోంరaర్‌ జిల్లాలో 12 మంది సభ్యులతో కూడిన రెండు వనవాసి కుటుంబాలు ఘర్‌ వాపస్‌ అయ్యాయి. స్థానిక గ్రామస్తులు సామాజిక కార్యకర్తల భాగ స్వామ్యంతో ఈ ఘర్‌ వాపసీ వేడుకను స్థానిక ధర్మ జాగరణ్‌ సమన్వయ విభాగం నిర్వహించింది. ఘాసిపురా బ్లాక్‌లోని పురునబంధ్‌గోడ పంచాయతీ పరిధిలో ఉన్న నానికాబహలి గిరిజన కుగ్రామానికి చెందిన ఈ కుటుంబాలు చాలా సంవత్సరాల కిందట తమ ప్రాంతాన్ని సందర్శించిన క్రైస్తవ మిషనరీలచే ప్రభావితమయ్యాయి. సాంప్రదాయ విశ్వాసాన్ని విడిచిపెట్టి క్రైస్తవమతాన్ని స్వీకరించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని, కుల వ్యవస్థ నుండి విముక్తి లభిస్తుందని మిషనరీలు వారిని నమ్మించి మతంమార్చారు.

 హిందూ ధర్మాన్ని స్వీకరించిన తర్వాత సేతక్‌ సింగ్‌, గురుబారి సింగ్‌, నరేంద్ర గగారాయ్‌ స్పందిస్తూ హిందూ దేవతలను పూజించడం వల్లే తమ కుటుంబం మరింత ఆరోగ్యంతో వృద్ధి చెందుతుందన్న నమ్మకంతో తిరిగి వచ్చామన్నారు. ‘‘చాలా సంవత్సరాల క్రితం, క్రైస్తవ మిషనరీలు మా గ్రామానికి వచ్చారు. ఆ సమయంలో, మా కుటుంబంలోని కొంతమంది సభ్యులు అనా రోగ్యంతో ఉన్నారు. హిందూ దేవతలను పూజిం చడం వల్లే మా ఆరోగ్యం దెబ్బతిన్నదని మిషనరీలు మాకు చెప్పారు. మన దేవతలను విడిచి ఏసుక్రీస్తును పూజిస్తే, మా ఆరోగ్యం మెరుగుపడుతుందని వారు అన్నారు. క్రైస్తవమతంలో కుల వ్యవస్థ లేదని, కాబట్టి మతం మారాలని కూడా వారు నొక్కి చెప్పారు. అయితే, ఈ ప్రకటనలతో తప్పుదారి పట్టి, మేము మా నిజమైన విశ్వాసాన్ని విడిచిపెట్టాము. అయితే, క్రైస్తవ మిషనరీలు మమ్మల్ని మతం మార్చుకునేలా చేసి మోసగించారని మేము తరువాత గ్రహించాము. ధర్మ జాగరణ సమన్వయ సమితి కార్యకర్తలు మమ్మల్ని సంప్రదించి, మా నిజమైన విశ్వాసానికి తిరిగి రావాలని ప్రోత్సహించినప్పుడు, మేము అంగీకరించాము’’ అని ఆ వనవాసీ కుటుంబాల వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *