తుదిశ్వాస విడిచిన వందనీయ ప్రమీల తాయీ మేఢే జీ
రాష్ట్ర సేవికా సమితి నాలుగో ప్రముఖ సంచాలిక వందనీయ ప్రమీల తాయీ మేఢే జీ (96) గురువారం అంతిమ శ్వాస విడిచారు. ఉదయం 9:05 గంటలకు వృద్ధాప్యం కారణంగా కన్నుమూశారు. ప్రమీలా తాయి జీవితం ఎందరికో ఆదర్శవంతంగా నిలిచింది. ఎల్లప్పుడూ జాతీయవాద ఆలోచనలతోనే జీవించారు. ప్రమీలా తాయి 1978 నుంచి 2003 వరకు కార్యవాహికగా వున్నారు.ఆ తర్వాత 2003 నుంచి 2006 వరకు సహ సంచాలికగా, ఆ తర్వాత 2006 నుంచి 2012 వరకు సంచాలికగా మార్గనిర్దేశనం చేశారు.
నాగపూర్ విశ్విద్యాలయం నుంచి మాస్ కమ్యూనికేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ గా, దీని తర్వాత జర్నలిజంలో దశాబ్ద కాలం పాటు చురుగ్గా పనిచేశారు. ప్రింట్, టీవీ, డిజిటల్ మీడియాలో కూడా పనిచేశారు. కొద్ది కాలం క్రితం వరకూ పాంచజన్య పత్రికలో పనిచేశారు. జాతీయ, అంతర్జాతీయ విషయాలపై అమిత ఆసక్తిని చూపించేవారు.
ఇటీవల జరిగిన కేంద్రబైఠక్ లో కడసారి వారు online ద్వారా అందించిన సందేశం “आप सतर्क रहिये, गलत काम नहीं करना” అందరూ జాగ్రత్తగా ఉండండి.. ఎప్పుడూ తప్పు చేయవద్దు.. సరిఅయిన మార్గం లో పయనించండి”అని కార్యకర్తలకు మార్గనిర్దేశనం చేశారు.జూలై 20న, అఖిల భారత కార్యనిర్వాహక మరియు ప్రతినిధి బృందం బైఠక్ లో, భారతదేశం నలుమూలల నుండి వచ్చిన సేవికలను ఆమె వర్చువల్ గా కలుసుకుని, “సర్వే భవంతు సుఖినః” అని ఆశీర్వదించి, దారి తప్పవద్దని వారికి బోధించారు. ఆదరణీయ ప్రమీలాతాయి జీ సమితి ప్రథమ ప్రముఖ సంచాలిక మొదలుకొని ప్రస్తుత ప్రముఖ సంచాలిక వరకు అందరితో కలిసి పనిచేశారు.
ఆమె చివరి కోరిక ప్రకారం, ఆమె మృతదేహాన్ని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు విరాళంగా ఇస్తారు. ఈరోజు, నాగ్‌పూర్‌లోని రాష్ట్ర సేవికా సమితి ప్రధాన కార్యాలయంలో రోజంతా అంత్య దర్శనం లభిస్తుంది. లెక్కలేనంత మంది కార్యకర్తలకు స్ఫూర్తిదాయకంగా, క్రమశిక్షణతో, అధ్యయనశీలిగా, విశ్వాసపాత్రురాలిగా మరియు గొప్ప వక్తగా నిలిచిన ప్రమీలా తాయిజీకి రాష్ట్ర సేవికా సమితిని నివాళులు అర్పించింది.