వరలక్ష్మీ వ్రతం-రక్షాబంధనం

హిందువులకు శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనది. వరలక్ష్మీ వ్రతం , రక్షాబంధనం ఇదే మాసంలో రావటం చాల విశేషం. సనాతన ధర్మంలో ఈ రెండు ఉత్సవాలను చాలా భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు. ఈ రెండు పండగలు కూడా లక్ష్మీ దేవికి సంబందించినవి కావటం మరింత విశేషం.

వరలక్ష్మీ వ్రతం

 ఈ వ్రతం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం దక్కి, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా కొత్త కోడళ్లతో అత్తవారింట ఈ వ్రతాన్ని చేయడం విశేషం.

ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన శ్రావణ మాసానికి పరిపూర్ణత, పరిపక్వతను తీసు కొచ్చేది వరలక్ష్మీ వ్రతం. మహాలక్ష్మీ అష్టవిధ రూపాలతో సర్వ మానవాళి కోరికలు తీరుస్తూ, ఎల్లవేళలా రక్షిస్తుంది.

రక్షాబంధనం

ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది, శ్రీకృష్ణుడికి అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడి ని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు.

శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతా ళంలో ఉండిపోతాడు. శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధంకట్టి, తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. ‘‘యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వా మభిబధ్నామి రక్షే మా చల మా చల’’ భావం- ఓ రక్షాబంధమా! మహాబలవంతుడూ, రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు. కాబట్టే నేను నిన్ను ధరస్తున్నాను. రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌శాఖలలో హిందూ సంఘటనకు ప్రతీకగా భగవద్వజానికి రక్ష కట్టి స్వయంసేవకులు ఒకరికొకరు రక్ష కట్టుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat