భారత్ లో ఆధ్యాత్మిక పునరుజ్జీవనం.. వారణాసికి రికార్డు స్థాయిలో పర్యాటకులు

భారత పర్యాటక రంగానికే వారణాసి పుణ్య క్షేత్రం పునర్నిర్వచనం ఇచ్చింది. ఒకప్పుడు ఆధ్యాత్మిక రాజధానిగానే పరిగణింపబడేది. కానీ… ఈ పురాతన, ఈశ్వరుడు సజీవంగా వుండే నగరం గోవా, సిమ్లా వంటి సంప్రదాయ పర్యాటక కేంద్రాల కంటే ఎక్కువగా ఎదిగింది. గోవా, సిమ్లా కి వెళ్లే పర్యాటకుల సంఖ్య కంటే వారణాసికి వచ్చే పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.2024 లో 18.7 శాతం పర్యాటకుల సంఖ్య పెరిగిందని అధికారిక గణాంకాలు వెల్లడించాయి.సుమారు 11 కోట్లకు పైగా పర్యాటకులు వారణాసిని సందర్శించినట్లు ప్రకటించాయి.దీంతో అది పర్యాటక కేంద్రంగా ఎదుగుతోందని స్పష్టంగా ద్యోతకమవుతూనే వుంది.

రికార్డు స్థాయిలో సందర్శకుల సంఖ్య: 2024లో 11 కోట్ల మంది సందర్శకులు

ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం, వారణాసి 2024లో 11 కోట్ల మంది సందర్శించారని ప్రకటించింది.204 లో 9.3 కోట్ల మంది సందర్శిస్తే, 2024 లో ఏకంగా 11 కోట్ల మంది వచ్చారు.ఇది 2021 తో పోలిస్తే 120 రేట్లు పెరిగింది.

మరో గణాంకాల ప్రకారం 2021 లో కేవలం 2,566 మంది విదేశీయులు దర్శిస్తే, 2022 లో ఆ సంఖ్య 83,741, 2023 లో 2,01,904 కి, 2024 లో 2,09,932 కి పెరిగింది. అదే విధంగా జూన్ 2025 జూన్ లో ఏకంగా 1.88 లక్షల మంది విదేశీ సందర్శకులు వచ్చారు. దీనిని బట్టి చూస్తే అత్యంత పురాతన ఆధ్యాత్మిక నగరాన్ని చూసేందుకు విదేశీయులు కూడా ఉత్సుకత చూపిస్తున్నారని అర్ధమైపోతోంది.

సంప్రదాయ పర్యాటక ప్రదేశాలను అధిగమించిన వారణాసి..

ఎప్పటి నుంచి పర్యాటక ప్రదేశాలు అంటే గోవా, సిమ్లా, జైపూర్ అని గుర్తుకొస్తుంది. కానీ… వీటిని కూడా వారణాసి అధిగమించేసింది. మన దేశ పర్యాటకులు 2021 లో 30.7 లక్షలుంటే.. 2024 లో 10.97 కోట్లకు పెరిగింది. అయితే..2025 లో మొదటి ఆరు నెలల్లో 12.96 కోట్లకు దాటింది.

ఇక.. దీనిని బట్టి చూస్తే సాంస్కృతిక పునరుజ్జీవనం, మౌలిక సదుపాయాలు వృద్ధికి ఊతమిస్తున్నాయి. వారణాసిని ప్రపంచ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నం ఫలించింది” అని సింగ్ అన్నారు. “అయోధ్య, మధుర మరియు ప్రయాగ్‌రాజ్‌లతో పాటు, కాశీ ఏడాది పొడవునా సందర్శకులను ఆకర్షిస్తోంది’’ అని ప్రభుత్వం ప్రకటించింది.

మరోవైపు తాజాగా జరిగిన మహా కుంభ మేళా కూడా ఇందుకు విపరీతమైన ఊపునిచ్చింది. పర్యాటకుల సంఖ్య పెరిగిపోవడంతో పాటు వారణాసిలో స్థానికంగా వుండే వ్యాపారాలు కూడా బాగా పెరిగాయి. హోటళ్లు, గెస్ట్ హౌసులు కూడా వృద్ధిలో వున్నాయి. రవాణా సేవలు కూడా బాగా విస్తరించాయి.పర్యాటక రంగం విజృంభణ స్థానిక నివాసితులకు, టూరిస్ట్ గైడ్‌లు, డ్రైవర్ల నుండి చేతివృత్తులవారు మరియు విక్రేతల వరకు వేలాది కొత్త ఉద్యోగాలను సృష్టించింది.స్వదేశ్ దర్శన్ మరియు ప్రసాద్ (తీర్థయాత్ర పునరుజ్జీవనం మరియు ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి డ్రైవ్) వంటి ప్రభుత్వ కార్యక్రమాలు నగర మౌలిక సదుపాయాలను పెంపొందించడంలో మరియు స్థిరమైన పర్యాటక వృద్ధిని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషించాయి.

వారణాసి ఒక శక్తివంతమైన పర్యాటక కేంద్రంగా పరిణామం చెందడం కేవలం ఆర్థిక విజయగాథ మాత్రమే కాదు, ఇది ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం.భారత ఆధ్యాత్మిక వారసత్వం తిరిగి పెరుగుతోంది.ప్రపంచం కాశీని ఒక పవిత్ర నగరంగా మాత్రమే కాకుండా, భారతదేశ జీవన వారసత్వానికి ఆత్మగా గుర్తిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *