అవే స్వర్ణ పత్రాలు
మన చరిత్రకు చెందిన కాలానికి సంబంధించిన కొన్ని పుటలను ‘‘బంగరు పుట’’లని అంటున్నారు. అందుకు కారణమేమిటి? కొలబద్ధ ఏమిటి? అని ప్రశ్నిస్తే ఆ కాలానికి సంబంధించిన చరిత్రలో కావ్య, సంగీతాలలోను, పౌరుష పరాక్రమాలు, ఐశ్వర్య ఆధ్యాత్మికతలకు చెందిన పుటలలో ` పై కొలబద్దకు సరిపోగలవి ` అనేక పుటలు దొరుకుతాయి. అవే స్వర్ణపత్రాలు. కానీ ఏదైనా ఒక దేశం మీద పరాయి పరిపాలన అన్న మేఘాలు అలుముకొని దురాక్రమణదారుల కాళ్ళక్రింద ఆ దేశం నలిగిపోతూవుంటే ఆ పరాయి పరిపాలననుంచి దేశానికి ముక్తి కలిగించి, ప్రబల శత్రువును పరాభవించి, అపరి మిత పరాక్రమంతో తన దేశాన్ని పరాయిపాలన నుండి స్వతంత్రం చేసి స్వరాజ్యాన్ని స్థాపించిన తరం ` ఆ తరానికి నాయకత్వం వహించిన వీరుల విజయాలను, వివరాలను అందించే చరిత్ర పుటలను నేను స్వర్ణప్రతాలు అని పేరొంటున్నాను.
– స్వాతంత్య్రవీరసావర్కర్