ప్రేమను పంచుతున్న ‘వాత్సల్యగ్రామ్‌’

సాధ్వీ రితింభర.. పరిచయం అక్కర్లేని సాధ్వీమణి. జాతీయోద్యమాలు, అయోధ్య రామ మందిర ఉద్యమంలోనూ అగ్రగామిగా వున్నారు. ఓ వైపు ఈ కార్యక్రమాలు చేస్తూనే.. మరోవైపు సేవ కూడా చేస్తున్నారు. వీటన్నింటిని గమనంలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఆమెకు తాజాగా పద్మభూషణ్‌ ప్రకటించారు. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ఆమె పద్మభూషణ్‌ అందుకున్నారు. ఈ అవార్డును తన గురుదేవుల చరణాలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ అవార్డు వాత్సల్య గ్రామ్‌లోని గ్రామస్థులందరికీ దక్కినట్లేనని ప్రకటించారు కూడా.

సాధ్వీ రితింభర స్వస్థలం పంజాబ్‌ లోని లుథియానా జిల్లాలోని ఓ కుగ్రామం. అసలు పేరు నిషా కిషోరీ. 16 ఏళ్ల ప్రాయంలోనే హరిద్వార్‌ లోని స్వామి పరమానంద గిరి దగ్గర సన్యాస దీక్ష స్వీకరించారు. సన్యాస దీక్ష తర్వాత ఓ వైపు ఆధ్యా త్మిక సాధన, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూనే.. మరోవైపు సామాజిక సేవ కూడా చేస్తున్నారు.

1990లో జరిగిన అయోధ్య రామమందిర ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా పాల్గొన్నారు. అప్పటి నుంచే అత్యంత ప్రాచుర్యంలోకి వచ్చారని కూడా చెప్పొచ్చు. ఆవిడ ఉపన్యాసాలు అనేక మందికి ప్రేరణనిచ్చాయి. మహిళలు కూడా విశేషంగా ఆకర్షితులై, ఉద్యమంలో ముందు వరుసలో నిల్చున్నారు. అప్పట్లో ఆవిడ ఉపన్యాసా లను కేసెట్ల రూపంలో తయారు చేసి, దేవాలయాల్లో కూడా వేసేవారు. చాలా తక్కువ మందికి తెలిసిందే మిటంటే.. అనాథ పిల్లల బరువు బాధ్యతలను సాధ్వీ రితింభర తన భుజస్కంధాలకు ఎత్తుకున్నారు. బృందావన్‌ ప్రాంతంలోని వాత్సల్య అనే గ్రామంలో ఈ సామాజిక సేవ చేస్తున్నారు. ఈ పిల్లల చదువు, వివాహ బాధ్యతలను కూడా రితంభరే చూసుకుంటు న్నారు. వీరందరూ ‘వాత్సల్య గ్రామ్‌’ అనే ప్రాంతంలో కళాశాల విద్య అభ్యసిస్తుంటారు. వీరు విద్యనభ్యసిస్తూ.. చెడు వ్యవసనాల వైపు వెళ్లకుండా వున్నారంటే.. సాధ్వి రితంభర చేసిన కృషే అని నిర్మొహ మాటంగా చెప్పవచ్చు. ఆ పిల్లలందరూ ఎదిగి, పెద్దవారైన తర్వాత, పెళ్లి అయిన తర్వాత తిరిగి వచ్చి, ఈ వాత్సల్య గ్రామాన్ని కచ్చితంగా సందర్శిస్తారు. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. వాత్సల్య గ్రామం అనేది ‘‘మంచి మనుషులను తయారు చేసే ఓ ఫ్యాక్టరీ’’. అని చెప్పుకుంటారు.

పేరుకు తగ్గ గ్రామమే ఇది. ఇక్కడ  వాత్సల్యమే వుంటుంది. దైవిక, ప్రేమ, శ్రద్ధ, ఆప్యాయతకు మారు పేరుగా సాధ్వీ రితంభర దీనిని తీర్చి దిద్దారు. నివసించడానికి ఇళ్లులేదు, తినడానికి తిండి కూడా లేదు, ఏదైనా ఇబ్బందులు వస్తే.. వారిని దగ్గరికి తీసే నాథుడే లేడు. అలాంటి వారందర్నీ దగ్గరికి తీసి, రితింభర వారిని సాకుతున్నారు. వారందరికీ ఆశ్రయాన్ని కల్పిస్తూ, వాత్సల్యాన్ని పంచుతున్నారు.

అలాగే ఆ పిల్లలందరికీ సంస్కారంతో పాటు మంచి విద్యను కూడా అందిస్తున్నారు. అదే గ్రామంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ‘‘సంవిద్‌ గురుకులం’’ పేరుతో ఓ పాఠశాల కూడా వుంది. ఆధునిక సిలబస్‌తో రూపొందించిన విద్యతో పాటు భారతీయ సంస్కారం కలిగిన పాఠాలను కూడా బోధిస్తుంటారు. అలాగే పెద్ద గోశాల కూడా వుంది. గోసేవ అక్కడి వారికి రితింభర సాధ్వీ నేర్పిస్తుంటారు.

2013 మే 20న ‘వాత్సల్య గ్రామ్‌’కి శంకు స్థాపన జరిగింది. గుజరాత్‌ అప్పటి ముఖ్య మంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, ప్రముఖ ప్రవచన కారులు మురారీ బాపుతో పాటు ఇతర ప్రముఖుల సమక్షంలో గుజరాత్‌లోని మహిసా డాకోర్‌ సమీపంలో శంకుస్థాపన జరిగింది. అనాథలు, ఒంటరి మహిళలు, వృద్ధులు అందర్నీ దగ్గరికి చేర్చి, అక్కున చేర్చుకునే ఓ క్యాంపస్‌ ‘వాత్సల్య గ్రామ్‌’ అని సాధ్వీ రితంభర అభివర్ణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *