నాగపూర్ లో హిందువులపై జరిగిన దాడుల్ని ఖండిస్తున్నాం : వీహెచ్ పీ ప్రకటన

నాగపూర్ కేంద్రంగా చెలరేగిన అల్లర్లపై విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా స్పందించింది. బజరంగ్ దళ్ కార్యకర్తలపై, వారి ఇళ్లపై, మహిళలపై ముస్లిం సమాజంలోని ఓ వర్గం దాడికి దిగిందని విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి మిళింద్ పరాండే అన్నారు. ఈ ఘటనను తాము ఖండిస్తున్నామని, తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. నాగపూర్ హింసా కాండకి ముందు హిందువులు ఖురాన్ ను తగలబెట్టారని మత ఛాందసులు తప్పుడు వార్తలను ప్రచారం చేశారన్నారు. ఈ పుకార్లను మిలింద్ పరాండే తిరస్కరించారు. ఇది శుద్ధ అబద్ధమని ప్రకటించారు. ఇలాంటి అసత్యాలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఛత్రపతి శంభాజీ నగర్ లోని ఖుల్తాబాద్ లో వున్న ఔరంగజేబ్ సమాధి అభివృద్ధి చేయాలన్న ఆలోచనే చేయకూడదన్నారు. దీనికి బదులుగా ఔరంగజేబును ఓడించిన మరాఠా యోధులు ధనాజీ, శంతాజీ, రాజారాం మహారాజ్ స్మారకాన్ని అదే స్థానంలో నిర్మించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే ఔరంగజేబుకి మద్దతిచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని, హింసను వ్యాప్తి చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *