అక్రమ మత మార్పిళ్లను అరికట్టడానికి చట్టం తేవాలి : VHP డిమాండ్
అక్రమ మత మార్పిళ్లను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకురావాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది.చంగూర్ బాబా తర్వాత, ఆగ్రాకి చెందిన అబ్దుల్ రెహ్మాన్ అరెస్ట్ తో దేశ వ్యాప్తంగా ఇస్లామిక్ మత మార్పిడి నెట్ వర్క్ ఎలా విస్తరించిందో బలమైన ఆధారాలు అందిచిందని VHP సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్ అన్నారు. మత మార్పిడి నిరోధక చట్టాలు చేసిన రాష్ట్రాల్లోనూ మత మార్పిడి ముఠాలు పనిచేస్తున్నాయని ఆశ్చర్యం వ్యక్త చేశారు. మత మార్పిడి నిరోధక చట్టాలున్నా.. ప్రభుత్వాలు వాటి పట్ల సీరియస్ గా లేవని, మిషనరీలు, ఛాందసవాదులు ప్రజలను మతం మార్చే పనిలోనే వున్నారని విమర్శించారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే కఠినమైన చట్టాలను తీసుకురావాలని సురేంద్ర జైన్ డిమాండ్ చేశారు. మత మార్పిడి అనే విష వలయం హిందూ సమాజంపై దాడి చేయడమే కాకుండా, జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పుగా వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మత మార్పిడి ముఠాలకు PFI, SDPI వంటి ఉగ్రవాద సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే దీని కోసం జిహాదీ శక్తులు వారికి నిధులు కూడా సమకూరుస్తున్నాయని మండిపడ్డారు. ఈ విషయాలు పెద్దగా ఎవ్వరికీ తెలియవని, దీనిపై హిందూ సమాజం అప్రమత్తంగా వుండాలని పిలుపునిచ్చారు.