తిరుమల లడ్డూ దోషులపై చర్యలు తీసుకోవాలి : కోటేశ్వర శర్మ
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదమైన లడ్డూల తయారీకి చేప, పంది వగైరా జంతువుల కొవ్వు, ఇతర నూనెలతో కల్తీ చేసిన ఆవు నూనె ఉపయోగిచడంపై విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వర శర్మ స్పందించారు.జంతువుల కొవ్వు వాడారని, ఆహార పదార్థాల పరిశోధన శాలల నివేదికల ద్వారా నిర్ధారణ అయిన సమాచారం యావత్తు హిందూ సమాజానికి దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు.
పవిత్ర దేవాలయాల ప్రసాదాల తయారీ విషయంలో ఇంతటి హేయమైన చర్యలను విశ్వ హిందూ పరిషత్తు తీవ్రంగా ఖండిస్తోందని, నిందిస్తోందన్నారు. తిహిందువుల మనోభావాలను దబ్బదీసిన ఈ నీచమైన పాపానికి ఒడిగట్టిన దైవ ద్రోహులు, హిందూ సమాజ ద్రోహులు, కుట్రదారులు ఎవరో వెలికి తీయటానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే న్యాయ విచారణ (Judecial Enquiry) జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
హిందూ దేవాలయాల విషయంలో నిర్వహణలో జరుగుతున్న ఇలాంటి అనేక అవకతవకలు, అన్యాయాలు, అవినీతులు, అధార్మిక కార్యకలాపాలు, అన్యాయాలను అరికట్టటానికి దేశ వ్యాప్తంగా దేవాదాయశాఖ పరిధినుండి హిందూ దేవాలయాలనన్నింటిని తప్పించాలని డిమాండ్ చేశారు. వాటిని హిందూ సమాజానికి అప్పగించే విధంగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే పటిష్టమైన చట్టాన్ని తీసుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ విషయమై ఇలాంటి చట్టం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి Tweet ను పరిషత్ స్వాగతిస్తూ సమర్ధిస్తోందని కోటేశ్వర శర్మ తెలిపారు.