బంగ్లాదేశ్ హిందువులు పరాక్రమాన్ని చూపిస్తున్నారు : విశ్వహిందూ పరిషత్

హిందూ జనాభా తగ్గిన చోట ఏం జరుగుతుందో బంగ్లాదేశ్ ని చూస్తే అర్థమైపోతుందని విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్ అన్నారు. గతంలో హిందూ సమాజం మెజారిటీగా వుండేదని, కానీ నేడు దయనీయ స్థితిలో వుందన్నారు. బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితి అంత దయనీయంగా వున్నా… ఏ ఒక్క హిందువు కూడా ఏడవడం లేదని, పారిపోకుండా ధైర్యంగా తట్టుకొని పరాక్రమాన్ని చూపిస్తున్నారని అన్నారు. అసోం పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బంగ్లాదేశ్ లో హిందువులకు ఇబ్బందులు ఎదురైతే పరిష్కరించడానికి ఓ హెల్ప్ లైన్ నెంబర్ పెట్టామని, వారు సమాచారం అందించిన వెంటనే భారత ప్రభుత్వం సమన్వయతో బంగ్లాదేశ్ సర్కార్ పై ఒత్తిడి తెస్తుందని పేర్కొన్నారు. జిహాదీ మనస్తత్వం వున్న వారికి రాజ్యాంగంపై విశ్వాసమే వుండదని అన్నారు.
గతంలో న్యాయవ్యవస్థను భయపెట్టి న్యాయమూర్తులను మార్చారని, ఇప్పుడు బంగ్లాదేశ్ లో రాష్ట్రపతిని తొలగించాలని చూస్తున్నారని, అక్కడి జిహాదీలు ఏ వ్యవస్థనూ నమ్మరని మండిపడ్డారు. మరోవైపు దేశ ప్రజలందరికీ విశ్వహిందూ పరిషత్ పక్షాన దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ ప్రపంచంలోనే విశ్వగురు స్థానానికి ఎదగాలని రాముడ్ని ప్రార్థిస్తున్నామని తెలిపారు. దీపావళి రోజు వనవాసం ముగించుకొని, రాముడు అయోధ్యకు వచ్చాడని, తర్వాత రామరాజ్యం స్థాపించబడిందని గుర్తు చేశారు.
హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక కుట్రలను అంతం చేసి, దేశంలో రామరాజ్య స్థాపన జరగడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి మానవుడి హృదయం రాముడితో నిండాలన్నదే తమ సంకల్పం అన్నారు. భారత్ కి సంబంధించిన మూలాలన్నీ రాముడిలోనే వున్నాయని, ప్రపంచం మొత్తం నేడు హిందూ మూలాల వైపు చూస్తోందన్నారు. అందుకే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *