దేవాలయాలపై దాడులు చేసే దుండగులను శిక్షించాలి : విశ్వహిందూ పరిషత్
హైదరాబాద్ లో వరుసగా హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్న దుండగులను కఠిననంగా శిక్షించాలని VHP తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. వరుస దాడులను నిరసిస్తూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించింది. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో దాదాపు 40 నిమిషాలపాటు అన్ని విషయాలు చర్చించారు. ఇలాంటి దుర్ఘటనలతో నగరంలో అలజడి రేగి శాంతి భద్రతలు అదుపుతప్పుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అక్రమ మసీదులు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, మసీదుల్లో నివసిస్తున్న విదేశీ చొరబాటు దారుల వల్లే నగరానికి ముప్పు పొంచి ఉందని VHP నేతలు ఆందోళన చెందారు. దేవాలయల వద్ద నిఘా పెంచాలని డిమాండ్ చేశారు. దోషులను దొంగలుగా, పిచ్చి వారిగా ముద్రవేసి రక్షించ వద్దని కమిషనర్ కు సూచించారు. ఇతర ప్రాంతాలతోపాటు, ఇతర దేశాలనుంచి అక్రమంగా వలస వచ్చిన వ్యక్తులను గుర్తించి తరిమేయాలన్నారు. సికింద్రాబాద్ లోని కుమ్మరివాడ లో గల మసీదు కూడా అక్రమంగా నిర్మించారని చెప్పారు.
సానుకూలంగా స్పందించిన కమిషనర్ ఆనంద్ మాట్లాడుతూ భద్రతా చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కమీషనర్ కు అందించారు. VHP రాష్ట్ర అధ్యక్షులు నరసింహమూర్తి,నాయకులు రామరాజు,వేంకటేశ్వరరాజు,శశిధర్,పగుడాకుల బాలస్వామి,శివరాములు, కిశోర్, అనంత్,తిరుపతిలు కమీషనర్ ను కలిసిన వారిలో ఉన్నారు.