జిహాదీలు బాధితులు కానే కాదు… దురాక్రమణదారులే : సురేంద్ర జైన్

భారతదేశంలోని జిహాదీ శక్తులు హిందూ సమాజంపై, వారి పండుగలు, దేవాలయాలపై నిరంతరం దాడి చేస్తున్నాయి. ఈ దాడుల జాబితాలను విడుదల చేస్తూ విశ్వహిందూ పరిషత్ జాయింట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్ర జైన్ జిహాదీలు దురాక్రమణదారులని, బాధితులు కాదని ఈ జాబితాలు నిరూపిస్తున్నాయని స్పష్టం చేశారు.

భారతదేశంలోని సెక్యులర్, ముస్లిం అని పిలవబడే పార్టీలు, నాయకులను హెచ్చరిస్తూనే, ఈ జిహాదీలను వారి అధికార దురాశతో రెచ్చగొట్టడం ద్వారా, వారు హింసాత్మక ధోరణులను ప్రోత్సహిస్తున్నారని, దేశాన్ని అంతర్యుద్ధం వైపు తీసుకెళ్లేలా ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, జిహాదీలకు గుణపాఠం చెప్పాలని వారికి రక్షణ కల్పించకూడదని తెలిపారు.

ప్రతి పౌరుడు దేశ రాజ్యాంగం, చట్టాలు, న్యాయ వ్యవస్థ, జాతీయ సంస్కృతులు, సంప్రదాయాలను గౌరవించడం అవసర అని పేర్కొంటూ ఇది శాంతియుత సహజీవనానికి అత్యాసరమని ఆయన చెప్పారు. 2023, 2024 ఛత్ పూజ వరకు 300 కంటే ఎక్కువ సంఘటనల ఈ జాబితాలు దాడులు, దౌర్జన్యాలకు సంబంధించినవి మాత్రమే అని డాక్టర్ జైన్ చెప్పారు. ఈ కాలంలో జరిగిన దారుణాలు, దాడుల్లో ఇది పదో వంతు మాత్రమే అని తెలిపారు.

ఈ దాడుల అనాగరికత, క్రూరత్వం అమానవీయమైనవి మాత్రమే కాదు, వాటి రకాలు కూడా మానవ ఊహకు మించినవని ఆయన పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం ఇప్పటికే టెర్రర్ జిహాద్, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, పాపులేషన్ జిహాద్ వంటి వాటితో బాధపడుతుండగా, ఇప్పుడు స్పిట్ జిహాద్, యూరిన్ జిహాద్, ట్రైన్ జిహాద్, మైనర్ జిహాద్ మొదలైన వాటి ద్వారా ముస్లిమేతరులపై వారి ద్వేషం తెరపైకి వస్తోందని ఆయన వెల్లడించారు.

నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆలోచనాపరులు ముస్లిమేతరుల పట్ల ద్వేషం ఎక్కడి నుంచి వస్తుందనే దానికి సమాధానం వెతుకుతున్నారని డా. జైన్ తెలిపారు. ఈ జిహాదీ దాడులు, దౌర్జన్యాల భయం ప్రపంచవ్యాప్తంగా ఉంది. హమాస్‌ దాడులు అయినా, బంగ్లాదేశ్‌ జిహాదీల దాడులు అయినా, కాశ్మీర్‌లో హిందువుల ఊచకోత అయినా, బెంగాల్‌లో హిందువులపై జరిగిన దాడులైనా.. వీటన్నింటిలోనూ క్రూరత్వం కనిపిస్తుందని ఆయన తెలిపారు.

ఇదే పాత్ర 1400 సంవత్సరాలుగా మానవాళిని కలవరపెడుతోందని చెబుతూ ప్రపంచంలోని అతిపెద్ద దురాక్రమణదారులు తమను తాము బాధితులుగా చెప్పుకోవడం ప్రపంచంలోనే అతిపెద్ద వింత అంటూ డా. జైన్ ఎద్దేవా చేశారు. ప్రపంచంలో ఎక్కడా ఇస్లామోఫోబియా లేదని స్పష్టం చేస్తూ ఈ క్రూరమైన, అసహ్యకరమైన జిహాదీ మనస్తత్వాన్ని ఓడించాలని మొత్తం ప్రపంచంలోని నాగరికతలకు డాక్టర్ జైన్ పిలుపునిచ్చారు.
భారతదేశంలోని చాలా మంది మౌలానాలు, ముస్లిం నాయకులు హిందూ సమాజంపై సాగిస్తున్న హత్యలు, చంపేస్తామనే బెదిరింపులు వారి జిహాదీ మనస్తత్వానికి అనుగుణంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కానీ, వారిపై సెక్యులర్ సమాజం మౌనం వహించడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1946లో కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయని చెబుతూ ఈ మౌలానాలు, ముస్లిం నాయకులు భారతదేశంలో నరమేధం వంటి ప్రత్యక్ష చర్యను చేపట్టాలనుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *