హిందూ ఆలయాలకు విముక్తి కల్పించాలి..  వీహెచ్‌పీ

హిందూ దేవాలయాలు, మత సంస్థలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేయడానికి ఒక చట్టాన్ని రూపొందించాలని హిందూ సంస్థ విశ్వ హిందూ పరిషత్‌ (‌వీహెచ్‌పీ) కేంద్రానికి లేఖ రాసింది. అలాగే, మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఆమోదించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ నెల 27న సంస్థ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో.. విశ్వహిందూ పరిషత్‌ ‌హిందూ దేవాలయాలు, మత సంస్థలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేయడానికి చొరవ తీసుకుందని, ఈ ప్రయత్నంలో, వీహెచ్‌పీ కేంద్ర నాయకత్వం హిందూ ధర్మ సంస్థల ప్రతినిధులు, సాధువులను కలుస్తోంది.

తమిళనాడుకు చెందిన వీహెచ్‌పీ కార్యకర్తలతో సెంట్రల్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ అలోక్‌ ‌కుమార్‌, ‌జాయింట్‌ ‌జనరల్‌ ‌సెక్రటరీ స్తానుమలయన్‌, ‌సౌత్‌ ఇం‌డియా ఆర్గనైజింగ్‌ ‌సెక్రటరీ పీఎం నాగరాజన్‌ ‌లతో కూడిన బృందం హిందూ సాధువుల నుంచి మార్గదర్శకత్వం, ఆశీర్వాదం తీసుకుంటుందని వీహెచ్‌పీ తెలిపింది. సాధువులు దీర్ఘకాలంగా ఉన్న సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నారని ఆ ప్రకటనలో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *