చార్‌ధామ్ యాత్రలో ఇకపై వీడియోలు, రీల్స్ తీయడం నిషేధం
చార్‌ధామ్ యాత్రలో ఇకపై వీడియోలు, రీల్స్ తీయడాన్ని నిషేధించారు . ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. పలువురు భక్తుల కోరిక మేరకే ఈ నిర్ణయాన్ని తీసఱకున్నామని, ఆలయాల ప్రాంగణంలోని 50 మీటర్ల పరిధిలో వీడియోలు, రీళ్ల చిత్రీకరణపై నిషేధo వుంటుందని ఉత్తరాఖండ్ సీఎస్ ప్రకటించారు. ఆలయ ప్రాంగణంలోనే కొందరు రీల్స్ చేసఱ్తన్నారని, దీనివల్ల భక్తులకు తీవ్ర ఇబ్బందిగా మారిందని, వారి మత విశ్వాసవలను దెబ్బతీస్తోందని అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా పాటలకు డ్యాన్సులు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయన్నారు. మరోవైపు ఇప్పటికే చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఈ సవరి మొత్తం 26 లక్షల మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని ప్రభుత్వం తెలిపింది.