విధ్యాభారతి సేవా కార్యక్రమాలు

రెండు లక్షల మందికి పైగా ఉన్న సరస్వతీ శిశుమందిరాల పూర్వ విద్యార్థులను సామాజిక సేవలో పాల్గొనేలా క్రియాశీలకంగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విద్యాభారతి దక్షిణమధ్య క్షేత్ర అధ్యక్షులు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డా. చామర్తి ఉమామహేశ్వర్‌రావు వెల్లడిర చారు. ప్రస్తుతం సమాజం ఉన్న పరిస్థితుల్లో తమ విద్యార్థులను మంచిమార్పును సృష్టించే సంఘటనా శక్తిగా కార్యోన్ముఖం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం స్వర్ణజయంతి ఉత్సవాల్లో భాగంగా.. హైదరాబాద్‌ బండ్లగూడలోని శారదా ధామంలో పూర్వ విద్యార్థి పరిషత్‌ రాష్ట్రస్థాయి మహాసమ్మేళనం నిర్వహించారు. అత్యంత ఉత్సాహ భరితంగా జరిగిన ఈ సమ్మేళనానికి మణిపాల్‌ యూనివర్సిటీ ఛాన్సలర్‌, శ్రీ సరస్వతీ విద్యాపీఠం ప్రాంత అధ్యక్షులు ప్రొఫెసర్‌ తిరుమలరావు, ఏబీవీపీ పూర్వ జాతీయ నాయకులు పేరాల శేఖర్‌రావు ఆత్మీయ అతిథిగా పాల్గొని మార్గ నిర్దేశనం చేశారు. ఈ సమ్మేళనానికి తెలంగాణ నలుమూలల నుంచి వేలాదిగా పూర్వ విద్యార్థులు తరలివచ్చారు. ఆత్మీయ పూర్వకంగా సాగిన ఈ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చామర్తి ఉమామహేశ్వర్‌ రావు మాట్లాడుతూ బలహీనపడు తోన్న సాంస్కృతిక సంపదను తిరిగి పటిష్టం చేసుకునేలా సరస్వతీ శిశుమందిరాల పూర్వ విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేటి విద్యార్థుల్లో జాతీయ దృష్టి కోణం మెరుగుపడాలని ఆకాంక్షించారు. ఏ స్థాయికి ఎదిగినా మన మూలాలను మరిచిపోకూడదన్నారు.

విద్యాభారతి దక్షిణమధ్య క్షేత్ర సంఘటనా మంత్రి లింగం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ సరస్వతీ శిశుమందిరాల పూర్వ విద్యార్థులు జాతి నిర్మా ణంలో పాలు పంచుకోవాల్సిన తీరుని శక్తి మంతంగా వివరించి చెప్పారు. ప్రస్తుతం ఈ పూర్వ విద్యార్థలు దాదాపు అన్ని రంగాల్లోనూ ప్రముఖ స్థానాల్లో ఉన్నారని చెప్పారు.

పూర్వ విద్యార్థులు డీసీపీ రావుల గిరిధర్‌, కో ఆపరేటివ్‌ ట్రైబ్యునల్‌ సభ్యురాలు కిరణ్మయి తదితరులను ఈ సందర్భంగా వేదికపై సన్మానించారు. పూర్వ విద్యార్థి పరిషత్‌ ప్రధాన కార్యదర్శి బొడ్డు శ్రీనివాస్‌ పరిషత్‌ వార్షిక నివేదికను చదివి వినిపించారు. పూర్వ విద్యార్థులు తాము చదివిన పాఠశాలలను అన్ని వనరులతో ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సమ్మేళనంలో శిశుమందిర్‌ విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి నృత్యాలు, గీతాలు అందరినీ అలరించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *