విద్యా సంస్థల్లో కమ్యూనిస్టుల విషబీజాలు : లింగం సుధాకర్ రెడ్డి

మన దేశంపై ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు ఎవరికి వారు హిందూ సంస్కృతిపై దాడులు చేస్తున్నారని విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్రం సంఘటనా కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి అన్నారు. మన సంస్కృతిని నాశనం చేసే విషయంలో వీళ్లు పూర్తి క్లారిటీతో వున్నారని, హిందువుల్లోనే కొందరికి స్పష్టత లోపించిందన్నారు. అంతేకాకుండా కమ్యూనిస్టులకు, ముస్లింలకు, క్రైస్తవులకు వంత పాడుతున్నారని మండిపడ్డారు. మన దేశంలో కుహానా మేధావులున్నారని, కమ్యూనిస్టులలో అన్ని మతాల వారు వున్నప్పటికీ.. ముస్లింలను, క్రిస్టియన్లను వారు ఏమీ అనలేక, హిందువులను దూషిస్తున్నారన్నారు. నారాయణ పేట శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో విద్వత్ సదస్సు జరిగింది. ఈ విద్వత్ సదస్సులో ‘‘హిందుత్వ నిష్ఠ, రాష్ట్రభక్తి, జాతీయత’’ అనే అంశంపై లింగం సుధాకర్ రెడ్డి ప్రసంగించారు.

కమ్యూనిస్టులు హిందూ ధర్మాన్ని లక్ష్యంగా చేసుకొని, విద్యా రంగాన్ని వాడుకొని, పాఠశాలల్లో, కళాశాలల్లో, యూనివర్శిటీల్లో విష బీజాలు నాటుతున్నారని లింగం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. అందుకే… విద్యా సంస్థల్లో మన పిల్లలకు ఏం బోధిస్తున్నారో తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూనే వుండాలని సూచించారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలతో పాఠశాలల్లో ఏం చెప్పారో.. ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే వుండాలన్నారు. అంత చిక్కని మన జ్ఞానాన్ని సంస్కృతమును మనకు తెలియకుండా మెకాలే విద్యా విధానంను ప్రవేశపెట్టి గుమాస్తాలుగా తయారు చేశారన్నారు. ఈ విధానాన్ని రూపుమాపడానికి విద్యాభారతి ప్రయత్నాలు చేస్తోందని వివరించారు.

హిందుత్వం ఒక మతం కాదని, ఓ జీవన విధానమని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. భగవంతుడు సర్వాంతర్యామి అనేది హిందువుల అభిప్రాయమని తెలిపారు. అందుకే చెట్టు పుట్ట కొండా కోన రాయి రప్ప నీరు గాలి ప్రతిదానిలో భగవంతుడు ఉన్నాడని మనం భావిస్తామని తెలిపారు.

విద్యారంగంలో జాతీయ విద్యా విధానం కోసం విద్యా భారతి పనిచేస్తోందని లింగం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.మనదైన సంస్కృతిని నాశనం చేయడానికి ఎడారి జాతులు, క్రిస్టియన్లు ఎంతో ప్రయత్నం అందులో భాగంగానే బ్రిటిష్ మెకాలే విద్యా విధానమును మనదేశంలో ప్రవేశపెట్టారని అన్నారు. మన శ్రద్ధ కేంద్రాలైన గుడి బడి తల్లి గోమాత తులసిమాత వీటి యొక్క ప్రాముక్యాన్ని అవసరాన్ని గుర్తించి వీటిని విద్యార్థులకు బోధించే ప్రణాళికను శ్రీ సరస్వతీ శిశు మందిరం ప్రయత్నం చేస్తోందనిలింగం సుధాకర్ రెడ్డి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *