విద్యా భారతి ఆధ్వర్యంలో ‘‘సైనిక్ స్కూల్’’.. తెలంగాణ వారికి గొప్ప అవకాశం

తెలంగాణ విద్యార్థులకు గొప్ప అవకాశం లభించింది. విద్యా భారతి ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్ ను ప్రారంభిస్తున్నట్లు విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి, నేతాజీ సైనిక్ స్కూల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ లింగం సుధాకర్ రెడ్డి ప్రకటించారు. విజయవాడలోని నేతాజీ సైనిక్ స్కూలులో అందుబాటులో వున్న 120 సీట్లలో 80 శాతం సీట్లు తెలంగాణ, ఏపీ విద్యార్థులకు రిజర్వ్ చేశామని ప్రకటించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా లింగం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ..

అఖిల భారత సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష 2025 కి హాజరై, కనీస అర్హత మార్కులు పొందిన విద్యార్థులు మాత్రమే నేతాజీ సైనిక్ స్కూల్ విజయవాడలో అడ్మిషన్ పొందేందుకు అర్హులని తెలిపారు. అందుబాటులో వలున్న సీట్లు సెప్టెంబర్ 23 న AISSAC2025 పోర్టల్ లో ప్రదర్శించబడతాయని అన్నారు. విద్యార్ధులు సెప్టెంబర్ 24,25 తేదీల్లో పాఠశాలలను ఎంపిక చేసుకోవాలని, సెప్టెంబర్ 26 న నేతాజీ సైనిక్ స్కూల్, విజయవాడను ఒకే ఆప్షన్ గా పెడితే పాఠశాలలో ప్రవేశం తప్పనిసరిగా లభిస్తుందని తెలిపారు. నేతాజీ సైనిక్ స్కూల్ లో ఇది మొదటి బ్యాచ్ అని, మెరిట్ జాబితా అక్టోబర్ 4 న పోర్టల్లో ప్రదర్శిస్తారన్నారు. అడ్మిషన్లు 11 నుంచి ప్రారంభం అవుతాయని, అక్టోబర్ 18 కి పూర్తవుతాయని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు వెంకట్రావు, విద్యా భారతి క్షేత్ర సంపర్క ప్రముఖ్ వినోద్, తెలంగాణ ప్రాంత అధ్యక్షులు ప్రొఫెసర్ తిరుపతి రావు, దాత సీబీఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మేము ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ ల్యాబ్లతో పాటు AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) / రోబోటిక్ ల్యాబ్, స్పేస్ ల్యాబ్, ఆస్ట్రానమీ ల్యాబ్, మ్యాథమెటిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్, న్యూట్రిషన్ ల్యాబ్, టింకరింగ్ ల్యాబ్ వంటి ప్రత్యేకమైన లేబొరేటరీలను ఏర్పాటు చేశాం. సంగీతం, ఆర్ట్ మరియు క్రాఫ్ట్ పాఠ్యాంశాల్లో భాగంగా చేర్చామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *