పిల్లల భవిష్యత్తు కోసం విద్యా భారతి చొరవతో ‘‘విద్యా దర్శన్’’

‘‘విద్యయా అమృత మష్ణుతే.,.. విద్య ద్వారా అమరత్వాన్ని పొందుతాం అన్నది అర్థం. “జ్ఞానం ద్వారా అమరత్వం పొందుతామన్న అర్థం కూడా వస్తుంది. సమగ్ర విద్య ద్వారా అణగారిన వర్గాలకు సాధికారత కల్పించాలన్న లక్ష్యాన్ని సేవా భారతి పెట్టుకుంది. దీని కోసం కేరళలో‘‘విద్యా దర్శన్’’ అన్న కార్యక్రమాన్ని రూపొందించింది. దీని ద్వారా అణగారిన వర్గాలకు, వనవాసీ జనాభాను ఉద్ధరించడం, వారికి జ్ఞానం, ఉత్తమ పరిశుభ్రమైన పద్ధతులను అందించడం మరియు పిల్లలకు పోషకమైన ఆహారాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కోసం ‘‘విద్యా దర్శర్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్లను నియమించింది.

కేరళలో పాలక్కాడ్ లోని షోలయూర్, నూల్ పుళలోని 30 వనవాసీ ప్రాంతాలను సేవా భారతి ‘‘విద్యా దర్శన్’’ కోసం ఎంచుకుంది. దీంతో 848 మంది పిల్లల్ని దత్తత తీసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది వనవాసీలోని పానియా తెగకు చెందిన వారు.అయితే ఈ ప్రాజెక్టు కోసం కోటి రూపాయలను ఖర్చు చేస్తోంది. విద్యా భారతి చేస్తున్న ఈ ప్రాజెక్టును చూసి ఇన్ఫోసిస్ సంస్థ ఆకర్షితమైంది. దీని కోసం అదనంగా నిధులను కూడా సమకూర్చుతోంది.

ఈ ప్రాజెక్టు ద్వారా 848 మంది పిల్లల భవిష్యత్తు మారుతోంది. వీరి బోధన కోసం నిపుణులతో పాటు ఇంటర్, గ్రాడ్యుయేషన్ పూర్తైన వారిని కూడా నియమించారు. వీరు పిల్లల భవిష్యత్తును మార్చేస్తున్నారు. ఈ ఉపాధ్యాయులను ‘‘గోత్ర సేవికలు’’ అని పేరు పెట్టారు. ఆదివారం మినహా… ప్రతి రోజూ రెండు గంటల పాటు విద్యా బోధన చేస్తారు. బోధనతో పాటు పిల్లలకు పాలు, గుడ్డుతో పాటు పోషకారాహాలను కూడా అందిస్తారు. అలాగే నిత్య జీవితంలో పరిశుభ్రత పాటించడం, పరిసరాలను పరిశుభ్రతపై కూడా అవగాహన కల్పిస్తారు. అలాగే ప్రాథమికంగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కూడా అందిస్తున్నారు. ఉపాధ్యాయులు బోధన కోసం ల్యాప్ టాప్ లు కూడా వినియోగిస్తున్నారు.

ఇక.. తల్లిదండ్రులకు కూడా విద్యా భారతి అవగాహన కల్పిస్తోంది.విద్యా దర్శన్ ‘తల్లిదండ్రుల శిక్షణ కార్యక్రమం’ ప్రారంభించింది. ఇది తల్లిదండ్రులకు వారి పిల్లలకు విద్య యొక్క ప్రాముఖ్యతను కూడా వివరిస్తున్నారు.కమ్యూనిటీ హాళ్లలో వీటిని నిర్వహిస్తారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల భవిష్యత్తు మారుతోందని, తల్లిదండ్రులకు కూడా అవగాహన వచ్చిందని నిర్వాహకులు సంతోషపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *