కార్మికుల పిల్లల కోసం విద్యాకుంభ్ పాఠశాలలు
కుంభమేళా ప్రాంతంలోని పనివారి పిల్లల కోసం యూపీ ప్రభుత్వం ప్రత్యేకంగా పాఠశాలలు నడుపుతోంది.వీటిని విద్యాకుంభ్ పాఠశాలలు అని పిలుచుకుంటున్నారు. ఇందులో కుంభమేళా సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వసల కార్మికుల పిల్లలకు ఇందులో విద్య అందిస్తున్నారు. వీటిని మహాకుంభమేళా అథారిటీ ప్రత్యేక అధికారిణి ఆకాంక్ష రాణా ప్రారంభించారు. వలస వచ్చిన వారి కార్మికుల పిల్లల చదువులకు ఇబ్బందులు రావొద్దన్న ఉద్దేశంతో వీటిని స్థాపించారు.
విద్యాకుంభ్ అనేది ఓ ప్రశంసనీయమైన చొరవే. కార్మిక కుటుంబాలకు చెందిన పిల్లల్లో విద్య పట్ల స్ఫూర్తిని నింపి, వారి భవిష్యత్తును మరింత మెరుగుపరచడానికి ఉపకరిస్తాయి.ఓ వైపు మహత్తరమైన కుంభమేళా… మరోవైపు విద్యామేళా జరుగుతోంది. కేవలం వలస వచ్చిన కార్మికుల పిల్లలే కాకుండా… చుట్టుపక్కల పిల్లలు కూడా ఇందులో చేరారు. ఈ పాఠశాల నాలుగు నెలల పాటు నడుస్తుంది. ఫౌండేషన్ లర్నింగ్, నాణ్యమైన విద్యా సామాగ్రి, నైపుణ్యాలను అందిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మహాకుంభమేళా కోసం వచ్చిన కార్మికుల పిల్లల చదువుకి అంతరాయం కలగకుండా వీటిని రూపొందించారు.ప్రాథమిక విద్యాశాఖ ఇందుకు పూర్తి సహకారం అందించింది.