‘విద్యాభారతి’ సంస్కారకేంద్రాలు

‘‘విద్యాభారతి’’ దేశంలోనే అతి పెద్ద స్వచ్ఛంద విద్యా సంస్థ. ఈ సంస్థ ద్వారా దేశ వ్యాప్తంగా నగరాలు, గ్రామాలు, వనవాసీ క్షేత్రాలు, సేవా బస్తీలలో ఏకోపాధ్యాయ పాఠశాలలు బాల సంస్కార కేంద్రములు, ఉచిత బోధనా తరగతులను నిర్వహిస్తోంది.సమాజంలో ధనిక, పేద, చిన్న, పెద్ద, ఉన్న, నీడ, జాతి, కుల, వర్ణ, వర్గ భేదములు తొలగి ప్రేమ భావన చిగురించి మానవజాతి అంతా ఒక్కటే అనే భావన పెంపొందునట్లు సామాజిక సమరసతా భావన వ్యాపించాలి. ఈ సామాజిక చైతన్య స్ఫూర్తి మన జాతీయ ఆవశ్యకత, దీనికి విద్య మరియు సంస్కార ప్రయత్నాలే ఆధారము.విద్యాభారతి లక్ష్యానికి అనుగుణంగా ప్రతి శిశుమందిరము సమీపంలో ఉన్న సేవా బస్తీలోని బాలబాలికలకు విద్య, సంస్కారము అందిస్తూ ఆ బస్తీలో సామాజిక మార్పును తీసుకొని రావాలన్నది మన యోజన. దీనికొరకు సేవాబస్తీలను ఎంపిక చేసుకొని సంస్కార కేంద్రాలు -నిర్వహిస్తున్నారు. ఈ సంస్కార కేంద్రాల ద్వారా, బస్తీలలో గొప్ప మార్పు వస్తోంది. ఈ బాల సంస్కారకేంద్ర నిర్వహణలో కళాశాల విద్యార్థులు, గృహిణులు, శిశుమందిర పూర్వ విద్యార్థులు భాగస్వాములు అవుతున్నారు. ‘‘సేవ’’ మాధ్యమంగా ఈనాదు విదేశీ శక్తులు మన దేశములోనికి ప్రవేశించి సమాజాన్ని మన ధర్మ సంస్కృతుల నుండీ దూరం చేసేందుకు విశేష ప్రయత్నము చేస్తున్నాయి. కాబట్టి సేవ ద్వారానే మనము సమాజాన్ని  కలపాలి. సమాజంలో ఏకాత్మతా భావాన్ని ఉంచడానికి, సేవా బస్తీలలోని బందువులను మిగిలిన సమాజంతో కలిపి ఉంచడం కోసం సేవాబస్తీలలో సంస్కార కేంద్రాలను శ్రీ సరస్వతీ విద్యా పీఠం ప్రారంభము చేయడం జరిగింది.

శ్రీ శారదాధామము సమీపంలోని సేవా బస్తీ ‘‘విశ్వరూప నగర్‌’’. సంవేదన శీల క్షేత్రము. అందరు పనికి వెలితే గాని పూట గడవని పరిస్థితి. ఆ బస్తీ లోని చిన్నారులను కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అటువంటి బస్తీలో శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం శ్రీ శారదాధామము శ్రీ సరస్వతీ బాల సంస్కార కేంద్రమును బస్తీలోనే నిర్వహకురాలిని ఎంపిక చేసి సంస్కార కేంద్రము ప్రారంభించింది. సంస్కార కేంద్రము ప్రారంభించక ముందు బాల బాలికలు పాఠశాలకు వెళ్లే వారు కాదు . మధ్యలో పాఠశాలను కూడా పూర్తిగా మానేసేవారు. సంస్కార కేంద్రము ప్రారంభము అయిన తదుపరి పాఠశాలకు క్రమము తప్పకుండా వెళ్ళడం అలవాటు అయింది. సేవా బస్తీలోని బాల బాలికలలో విద్యా స్థాయి పెరిగింది. బస్తీలో సంస్కార కేంద్ర సంరక్షణ సమితి నిర్మాణము అయింది. సంస్కార కేంద్రములు చిన్నవే కానీ, ఆ చిన్న సంస్కార కేంద్రములే పెద్ద మార్పుకు కారణమవుతున్నాయి.ఏ కపటము తెలియని గిరిజనులను ప్రలోభపెట్టి వారిని వారి సంస్క్రుతి నుండి దూరం చేయడానికి విదేశీ శక్తులు తమ కుయుక్తులతో ‘‘సేవ’’ పేరుతో చేరడానికి విశేష ప్రయత్నము చేస్తున్నాయి.వారి కుయుక్తులను అడ్డుకునేందుకు వనవాసులలో జాతీయతాభావము, సంస్క్రుతి, ధర్మ నిష్ట కలిగించేందుకు శ్రీ సరస్వతీ విద్యా పీఠం ఏకోపాధ్యాయ పాఠశాలలను నిర్వహిస్తున్నది.

శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఎప్పుడయితే ఏకోపాధ్యాయ పాఠశాలలు ప్రారంభించిందో చిన్నారి బాల బాలికలలో విద్యా ప్రమాణాలు సరిగాయి. ప్రభుత్వ పాఠశాలల యందు కూడా విద్యా ప్రమాణాలు పెరిగాయని చెప్పటం విశేషం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోను మరియు నాగర్‌ కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలోని వనవాసీ క్షేత్రములో ఎకోపాధ్యాయ పాఠశాలలను నిర్వహిస్తూ మారుమూల వనవాసీ బస్తీలలో గిరిజన వికాసమునకు కృషిచేస్తున్నది .అనేక స్థలాలలో మారుమూల వనవాసీ ప్రాంతాలలో గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా అక్కడి పర్వదినములతో పాటు జాతీయ భావాలను పెంపొందించు పండుగలు అయిన రక్షా బంధన్‌, జనవరి 26వ తేదీన భరతమాత పూజలు నిర్వహించడం కూడా క్రమేణా అలవాటు అయింది. వనవాసీ యువతలో వనవాసీ సంస్కృతి, ధర్మనిష్ఠ పట్ల అవగాహన పెంచేందుకు యువతకు కూడ అనేక అవగాహనా కార్యక్రమములు నిర్వహించబడుతున్నాయి. ఈ విధంగా శ్రీ సరస్వతీ విద్యా పీఠము నగరముల యందు గల సంస్కార కేంద్రముల ద్వారా, వనవాసీ ప్రాంతములలో ఏకోపాధ్యాయ పాఠశాలల ద్వారా శిశుమందిరము లతో పాటు. సామాజిక మార్పుకు జాతీయ సమైక్యతకు కృషిచేస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *