విజయదశమి

ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలోని మొదటి తొమ్మిది రోజులు జగన్మాతను ఆరాధిస్తారు. శరన్నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి.

దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. ‘శ్రవణా’ నక్షత్రంతో కలసిన ఆశ్వయుజ దశమికి ‘విజయా’ అనే సంకేతముంది. అందుకే దీనికి ‘విజయదశమి’ అనే పేరు వచ్చింది. విజయదశమి రోజు చేపట్టిన ఏ పనిలోనైనా విజయం తథ్యం అని ‘చతుర్వర్గ చింతామణి’ గ్రంథం తెలిపింది.

‘మహిషాసురుడు’ మరణంలేని జీవనం కోసం మేరుపర్వతశిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోరతపస్సు చేశాడు.  బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతల్తో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడిరచి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది. మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలు పాటిస్తున్నారు.

తెలంగాణా ప్రజలు దసరాసమయంలో బతుకమ్మ ఉత్సవాలు చేస్తారు. బతుకమ్మ పండుగ’ తెలంగాణా రాష్ట్రములో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపు కుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. నవరాత్రి మొదట రోజున బతుకమ్మను పూలతో అలంకరించి తొమ్మిది రోజులు ఒక చోట స్త్రీలంతా చేరి ఆటపాటలు పాడి ఆనందిస్తారు.

డాక్టర్‌ కేశవరావు బలిరాం హెడ్గేవార్‌ 1925 విజయదశమి రోజున నాగపూర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ుని స్థాపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థాగత స్థాయిలో  అధికారికంగా జరుపుకునే ఆరు పండుగలలో ఇది ఒకటి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *