మతమార్పిడికి గ్రామసభల అడ్డుకట్ట
గత సంచికల్లో గ్రామసభల ద్వారా ప్రజలకున్న నిర్ణయాధికారాన్ని సుప్రీం కోర్ట్ సైతం ఎలా సమర్ధిం చిందో, గ్రామసభలకు ఉన్న శక్తి, ప్రజలకున్న హక్కులు, బాధ్యతల గురించి చూశాం. ఈ సంచి కలో గ్రామసభల ద్వారా మతమార్పిడి ముఠాకు చెక్ పెట్టి, మతం పేరుతో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేసిన గ్రామాల గురించి తెలుసుకుందాం.
మతం అనేది సమాజానికి మంచి చేసేవిధంగా ఉండాలి. కానీ అదే మతం సమాజానికి ఇబ్బందిగా మారితే? మతపరమైన కార్యకలాపాల పేరుతో ప్రజలను కష్టనష్టాలకు గురిచేస్తుంటే? రాజ్యాంగం ఆర్టికల్ 25 ద్వారా ప్రజలకు అందిస్తున్న మతస్వేచ్ఛను దుర్వినియోగ పరిచే ఈ ఘటనలపై అరుణాచల్ ప్రదేశ్‌లోని ఓ గ్రామ ప్రజలు వ్యవహరించిన తీరు అత్యంత ఆదర్శంగా నిలుస్తోంది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈస్ట్ సియాంగ్ జిల్లాలో రెంగింగ్ అనే గ్రామం ఉంది. దాదాపు చైనా సరిహద్దులో ఉంటుంది. ఆ గ్రామ ప్రజలు అనేక ఏళ్లుగా చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి వచ్చే క్రైస్తవ మిషనరీల ద్వారా ఇందాక మనం చెప్పుకున్న అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో వారిలో ఒక ఆలోచన మొదలైంది.
‘మతం’ ముసుగులో జరిగే అక్రమ కార్యకలాపాలను ఎందుకు సహించాలి అనుకున్నారు. వెంటనే ఈ గ్రామస్తు లంతా ఏకమయ్యారు. ఒక గ్రామసభ ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని అత్యంత కీలకమైన తీర్మానాలు చేశారు. వాటిని గ్రామసభ పూర్తి మెజారిటీతో ఆమో దించింది. ఆ తీర్మానాలు ఏంటో తెలిస్తే వారికున్న దూరదృష్టికి మనం సెల్యూట్ చేయకుండా ఉండ లేము. అవేమిటో ఒకసారి చూద్దాం.
మొదటిది: గ్రామంలో ప్రతి ఒక్కరికీ పూర్తి మతస్వేచ్ఛ ఉంటుంది. ఆర్టికల్ 25 ద్వారా రాజ్యాంగం ప్రసా దించిన మతస్వేచ్ఛను సద్విని యోగం చేసుకునే వ్యక్తులు అదే ఆర్టికల్ లోని క్లాజ్1లో చెప్పిన బశ్రీఱమీ తీ•వతీ, వీశీతీ•శ్రీఱ•• వ•శ్రీ•ష్ట్ర అంటే సామజిక భద్రత, నైతికత, ఆరోగ్యం అనే అంశాలకు కచ్చి తంగా కట్టుబడి ఉండాలి.
రెండవది: గ్రామ పంచాయితీ అనుమతి లేకుండా ప్రార్ధనా మందిరాలపై లౌడ్ స్పీకర్లు ఉపయోగించరాదు.
మూడవది: గ్రామంలో ఏదైనా మతపరమైన కట్టడం నిర్మించాలంటే దాని గురించి మొదటి గ్రామ సభలో చర్చించి, గ్రామసభ ఆమోదం తీసుకుని, ఆ తర్వాత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణం చేపట్టాలి. ఒకవేళ నిర్మాణం చేపట్టేది విదేశీ మతానికి చెందినట్లైతే, అటువంటి నిర్మాణా నికి విదేశీ విరాళాలు వస్తున్నట్లైతే, ఆ నిర్మా ణాన్ని గ్రామసభ అంగీక రించదు. ఎందుకంటే గ్రామ ఆంత రంగిక వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ గ్రామసభ అంగీకరించదు అని స్పష్టంగా పేర్కొన్నారు. చూడండి వీళ్ళకున్న బాధ్యత, దేశభక్తి, ముందు చూపు.
ఇక నాల్గవది: మా గ్రామానికి వచ్చే ఇతర ప్రాంతాల మతప్రచారకులు, తాము ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఎవరి ద్వారా వచ్చారు, లోకల్ కాంటాక్ట్ పర్సన్ ఎవరు, వారు ఏ సంస్థ తరఫున వస్తున్నారు, తమ ఐడీ ప్రూఫులు, సంస్థ ఇచ్చిన గుర్తింపు కార్డులు గ్రామ కమిటీకి సమర్పించి ముందస్తు అనుమతి తీసుకోవాలి. అలా మత ప్రచారం కోసం ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు తమ గ్రామంలో ఎంత కాలం ఉంటారు, ఏమేం కార్యకలాపాలు చేస్తారు అనేది స్పష్టంగా తెలియజేయాలి.
వారు రూపొం దించిన అసలైన నిబంధనలు ఇప్పుడు చూద్దాం:
మతప్రచారం కోసం ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు..
– తమ మతప్రచారం కోసం మైకులు, లౌడ్ స్పీకర్లు ఉపయోగించరాదు.
– అనుమతి లేకుండా గేట్లు తీసుకుని ఇండ్లలోకి చొరబడరాదు.
– ఎవరికైనా తమ మతం గురించి చెప్పవచ్చు. కానీ అలా ఒకసారి చెప్పాక, అవతలి వారు వినటానికి నిరాకరిస్తే, మళ్ళీ రెండవసారి చెప్పడానికి ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే దాన్ని బలవంతపు మతప్రచారంగా పరిగణిస్తాం
– మతప్రచారం కోసం ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు ఇక్కడి గ్రామస్థులకు ఎలాంటి నగదు, బహుమతులు ఇవ్వరాదు. అలా ఇవ్వడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తాం.
– అలాగే మతప్రచారం కోసం ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు, తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇక్కడి పిల్లలకు తమ మతాన్ని బోధించరాదు. కనీసం వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళకూడదు.
– అదే విధంగా, మతప్రచారం కోసం వచ్చిన వ్యక్తులు రాజకీయ ప్రచారం చేయటం, ప్రభుత్వా లను విమర్శించడం వంటివి చేయరాదు.
ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇప్పుడు మనం చెప్పుకున్న గ్రామసభలో ప్రజలు చేసిన తీర్మాణాలన్నీ చట్టపరిధిలోనివే. ఉన్న చట్టాలను, కోర్ట్ తీర్పులను సక్రమంగా అమలు చేయాలి అని మాత్రమే తీర్మానాలు చేసుకున్నారు తప్ప ఏ మతానికీ వ్యతిరేకంగా చేసిందికాదు.
– ఏ.ఎస్. సంతోష్