విశ్వనాయకుడు వినాయకుడు
హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా వాటితో సంబంధం లేకుండా అందరూ గణపతిని ఆరాధించడం కద్దు. గణేశుడి పట్ల భక్తి జైన, బౌద్ధమతాల్లోకి కూడా విస్తృతంగా వ్యాపించింది. గణేశుడిని ఆటంకాలను తొలగించేవాడిగా (విఘ్నేశ్వరుడు), కళలకు, శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా భావించి పూజలు చేస్తుంటారు. పనులు ప్రారంభించేటపుడు కృతువుల్లో, పూజల్లో ప్రథమ పూజ గణపతికి చేస్తుంటారు. మానవ జీవితంలో విద్య ప్రారంభ సమయంలో చేసే అక్షరాభ్యాసంలో కూడా గణపతిని పూజిస్తారు. ఆయన పుట్టుక, లీలలను గురించి అనేక పౌరాణిక గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి.
ఋగ్వేదంలోని 2.23.1 శ్లోకంలో బ్రాహ్మణ స్పతిని వేద కాలపు గణపతిగా పరిగణిస్తారు. సా.శ 1వ శతాబ్దం నాటికే గణేశుడు ఒక ప్రత్యేకమైన దైవంగా అవతరించాడు. శైవ సాంప్రదాయం ప్రకారం గణపతి పునర్జీవితుడైన శివు పార్వతుల పుత్రుడే కానీ గణపతి అన్ని హిందూ సాంప్రదా యాల్లోనూ కనిపిస్తాడు.
వినాయకుడి ఆరాధన భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
– వినయకుని తొండము ‘‘ఓం’’కారానికి సంకేతమని చెబుతారు.
– ఏనుగు తల – జానానికీ, యోగానికీ చిహ్నము.
– మనిషి శరీరము-మాయకూ, ప్రకృతికీ చిహ్నము
– చేతిలో పరశువు-అజానమును ఖండించ డానికి సంకేతము
– చేతిలో పాశము-విఘ్నాలు కట్టిడవసే సాధనము
– విరిగిన దంతము – త్యాగానికి చిహ్నము
– మాల – జాన సముపార్జన
– పెద్ద చెవులు – మ్రొక్కులు వినే కరుణామయుడు
– పొట్టపై నాగ బంధము-శక్తికి, కుండలినికి సంకేతము
– ఎలుక వాహనము – జానికి అన్ని జీవుల పట్ల సమభావము ఉండాలి.