గీతే ప్రపంచానికి మార్గదర్శకం : జగదీప్ ధన్కర్

భగవద్గీత యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తోందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ అన్నారు. అంతర్జాతీయ గీతా మహోత్సవం సందర్భంగా హర్యానాలోని కురుక్షేత్రలోని గీతాజ్ఞాన సంస్థానం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు.భగవద్గీత యొక్క సారాంశాన్ని , సానుకూల ఆలోచనను సామరస్య సందేశాన్ని అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. సామాజిక క్రమశిక్షణ , శాంతి, అభివృద్ధి, సోదరభావం, పురోగతి, ఆనందానికి భగవద్గీత సూత్రాలు చాలా అవసరమని పేర్కొన్నారు .
ప్రతి ఒక్కరూ గీతా సారాన్ని అవలంబించాలని, సానుకూల ఆలోచనతో దేశ ప్రగతికి సహకరించాలని కోరారు. గీతా బోధనల స్ఫూర్తితో “పంచామృత నమూనా” పాలన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. “ప్రతి పౌరుడు ఇతరులపై ఆధారపడకుండా స్వీకరించగల ఈ పవిత్ర స్థలం నుండి నేను ఏమి సందేశం ఇవ్వగలనని లోతుగా ఆలోచించానని, . ” గీత నుండి ఐదు ప్రాథమిక సూత్రాలను ప్రతిపాదిస్తున్నానని , దీనిని పంచామృతం అని పిలవాలని” తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *