వ్యష్టి-సృష్టి

కుటుంబప్రబోధన్‌

హిందూ సిద్ధాంతం ప్రకారం ఈ సృష్టి అతి విశాలమైనది. అనాది అనంత కాలం నుంచి ఇది ఉంది. ఏ సూక్ష్మ మండలంలో ఈ భూమి ఉందో అది ఇప్పటికి 200 కోట్ల సంవత్సరాలకు పూర్వమే నిర్మాణమైంది. ఇక ముందు 232 కోట్ల సంవత్సరాల తరువాత అది నశించిపోతుంది. ఇలాంటి సూర్య మండలాలు మన అకాశగంగలో అనేకం. ఇలాంటి ఆకాశ గంగలు మన సృష్టిలో అనేకం ఉన్నాయి. అందుకే ఈ సృష్టి నిర్మాతను మనం అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడన్నాం. ఈ పరమేష్టి మనస్సులో ఒకసారి నేను ఒక్కడనే ఉన్నాను అనేకం అయితే బాగుంటుంది అనే ఆలోచన కలిగి (ఏకోహం బహుస్వామ్య) అప్పుడే ఈ అనేక అకాశగంగలతో అనేక కోటి బ్రహ్మండ ములతో కూడిన ఈ చరాచర సృష్టి నిర్మాణం చేశాడు.

ఇక వ్యక్తి విషయం చూస్తే, భూమ్మిద నివసించే ఏ ఇతర ప్రాణిలో లేని బుద్ధి, యుక్తాయుక్త వివేకం, పరస్పరం సామాజికంగా ఆలోచించి ప్రణాళికలు రూపిందింది వాటిని కార్యరూపంలో పెట్టె శక్తి మానవుడికే ఉన్నాయని మన దైవ, పాశ్చాత్య రెండు ఆలోచనా విధానాలు ఒప్పు కుంటాయి. వ్యక్తి తనకు లభించిన విశిష్ట గుణాల ద్వారా ఐహిక సుఖాలను పొందాలని, ఈ సుఖ ప్రాప్తికొరకు అవసరమైతే ఈ చరాచర సృష్టినంతా వినియోగించుకోవచ్చని పాశ్చాత్యులు భావిస్తారు. అలా చేయడంవల్ల పర్యావరణం చెడిపోయి సంతులనం కోల్పోయింది. పాశ్చాత్య ఆలోచనవ్యక్తి కేంద్రితతమైంది. వాళ్ల కుటుంబ జీవనం కూడా వ్యక్తి కేంద్రీకృతం కావడం వల్ల అక్కడ విడాకులు, గర్భస్రావాలు ఎక్కువైనాయి. భారతీయ ఆలోచన ప్రకారం చరాచర సృష్టిలో పరమేశ్వరుని అంశం ఉన్నది. అందుకే సృష్టిని అనుభవించేందుకైనా విషయంగా కాక మాతగా, దేవతగా మనం భావిస్తాం. కనుక సృష్టి ఒడిలో, ప్రకృతి ఒడిలో మనం ఉన్నామని భావిస్తాం. అందువల్ల పరస్పర శ్రేయస్సు కోసం అందరూ పాటుపడాలని అపేక్షించబడుతుంది. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించుకోవడానకి మానవ మాత్రుని ఆలోచన ఉండాలి అనే విషయం మన ఋషులు ఈ క్రింది శ్లోకంలో చెప్పారు.

త్యజేదేకం కలుస్యార్థే, గ్రామ స్వార్ధే కులం త్యజేత్‌

గ్రామం జనపదస్యార్దే, ఆత్మార్దే ఫృధీం త్యజేత్‌

కుటుంబం కోసం వ్యక్తి తన స్వంత పనిని, గ్రామం కోసం కటుంబం, దేశం కోసం గ్రామం ఆత్మ ప్రాప్తి కోసం భూమిని త్యాగం చేయాలి. వ్యక్తి ఇతరులపట్ల తనకుండే కర్తవ్యాన్ని పూర్తి చేయాలనే భావన కల్గిన కుటుంబాలే సమాజంలో సుఖపడతాయి. హక్కుల కోసం పోరాడే కుటుంబాలు దుఃఖాన్నే పొందుతాయి. అలా కుటంబ కర్తృత్వం ద్వారా భారతీయులను నిర్మాణం చేయడానికి మన ఋషులు ప్రయత్నించారు. సృష్టిలోని 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ మిక్కిలి దుర్లభం. చేస్తున్న కర్మను బట్టి ఈ జీవరాశులు పునర్జన్మలు పొందుతుంటాయి. ఉత్తమ కర్మ వల్ల ఉత్తమ ప్రాణి శరీరంలో, చెడు కర్మలు చేస్తే అదమ ప్రాణుల శరీరంలో ఈ జీవత్మ ప్రవేశిస్తుంది. దీన్నే కర్మసిద్దాంతం అన్నారు. మానవుడు ఏయే కర్మలు చేయాలి, ఏవి చేయకూడదో మానవుడు బుద్ధి బలంతో నిర్ణయిస్తాడు. కాబట్టి జీవితాన్ని సార్థక పరచుకోవడానికి మనకు ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే నాల్గు విధాలైన పురుషార్థాలని అందించారు. పాశ్చాత్యులకు జీవితమంటే జన్మ నుంచి మరణం వరకుండే కాలమే. మనకు పురుషార్థాలు, అశ్రమధర్మాలన్నాయి. అవి నరుడి నుంచి నారాయణుడయ్యే జీవన వికాస క్రమం మనకు అందిస్తాయి.

– హనుమత్‌ ప్రసాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *