ప్రజ్ఞా భారతి వరంగల్ శాఖ ఆధ్వర్యంలో పుస్తకావిష్కకరణ సభ
ప్రజ్ఞా భారతి వరంగల్ శాఖ ఆధ్వర్యంలో కోవెల సంతోష్ కుమార్ రచించిన కల్లోల భారతం, నిజాం పాలన చివరి రోజులు అన్న పేరుతో తెలుగులోకి అనువాదం చేసిన కస్తూరి మురళీ కృష్ణ పుస్తకాల ఆవిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ ఎల్లాప్రగడ సుదర్శన్ రావు అధ్యక్షత వహించారు. అలాగే ప్రజ్ఞా భారతి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చామర్తి ప్రభాకర్ రావు సంస్థ ఉద్దేశాలను వివరించారు.
నిజాం పరిపాలన చివరి రోజులు అన్న పుస్తకాన్ని రచయిత కస్తూరి మురళీ కృష్ణ పరిచయం చేయగా, కల్లోల భారతం అన్న పుస్తకాన్ని రచయిత కోవెల సంతోష్ కుమార్ పరిచయం చేశారు.
ఈ సందర్భంగా ఎల్లాప్రగడ సుదర్శన రావు మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదం పేరుతో విచ్ఛిన్నకర శక్తులు పెట్రేగిపోతూ, దేశ సమగ్రతకు విఘాతం కలిగిస్తున్నాయని, దీని ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విచ్ఛిన్నకారులు దేశ సమగ్రతకు, శాంతికి భంగం కలిగిస్తున్నారని అన్నారు.