మామిడి పంటకి రక్షణ ఈ ”వాటర్ ప్రూఫ్ బ్యాగ్”.. రైతు ఆలోచన ఇదీ

లక్నోకి చెందిన మలిహాబాదీ మామిడి పండ్లంటే దేశ వ్యాప్త ప్రసిద్ధి. భలే రుచిగా కూడా వుంటాయి. అయితే… కొన్ని రోజులుగా అక్కడి మామిడి పంట తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. గతేడాది కంటే ఈ యేడాది ఏకంగా 25 శాతం పంట కూడా తగ్గిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ పరిస్థితులు కానివ్వండి, లేదంటే… వాటికి వచ్చే తెగుళ్ల వల్ల కానివ్వండి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో బాగ్‌వాణీ సమితి కార్యదర్శి ఉపేంద్ర కుమార్‌ సిన్హా ఓ విరుగుడును తయారు చేశారు. అదే వాటర్‌ ప్రూఫ్‌ బ్యాగ్‌. ఈ వాటర్‌ ప్రూఫ్‌ బ్యాగులో ఓ పూత పూసి వుంచారు. ఈ పూత ద్వారా మామిడికి పూర్తి తరహా ఆక్సిజన్‌ అందుతుంది. అంతేకాకుండా పండు పక్వానికి కూడా ఇది బాగా దోహదకారిగా వుంటుంది. దీని కారణంగా రైతులు ఎలాంటి పురుగు మందులను వాడాల్సిన అవసరం కూడా లేదు.వర్షం వచ్చినా, తుపాను వచ్చినా… మామిడి విరిగిపోదు, పాడవదు. పురుగుల బెడద నుంచి కూడా ఈ వాటర్‌ ప్రూఫ్‌ బ్యాగ్‌ కాపాడుతుందని ఆయన పేర్కొన్నారు.

 

అంతేకాకుండా ఈ బ్యాగులో వుండే పూత ద్వారా పండు పరిమాణం కూడా 20 శాతం పెరుగుతుందని తెలిపాడు. ఉదాహరణకు 200 గ్రాముల మామిడి పండు వుంటే.. అది 220 గ్రాములు అవుతుందని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తమ మామిడి పంటతో మార్కెట్‌కి వెళ్లినప్పుడు ధర కూడా ఎక్కువగా వచ్చి, లాభపడతారని తెలిపారు. అయితే..ఈసారి తమ కమిటీ నుంచి 50 వేల వాటర్‌ ప్రూఫ్‌ బ్యాగులు అందుబాటులో వున్నాయన్నారు. దీని ద్వారా జూన్‌లో వచ్చే మామిడి పంటకి ఇది అందుబాటులో వుంటుందన్నారు. ప్రస్తుతం ఈ వాటర్‌ ప్రూఫ్‌ బ్యాగు ధర రెండున్నర రూపాయలుగా వుందని, ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే రైతులు ఎక్కువగా కొనుక్కోవచ్చని ఉపేంద్ర పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *