పేకేరు సర్పంచ్ కి అరుదైన గౌరవం… సదస్సులో మాట్లాడాలంటూ ఐరాస ఆహ్వానం
పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన ఇరగవరం మండలం పేకేరు సర్పంచ్ కునుకు హేమ కుమారికి అరుదైన గౌరవం దక్కింది. ‘భారత్‌లో స్థానిక సంస్థల ప్రభుత్వాల్లో మహిళల పాత్ర, మహిళా సాధికారతకు మార్గాలు’’ అనే అంశంపై ప్రసంగించాలంటూ ఐక్యరాజ్య సమితి నుంచి ఆమెకు ఆహ్వానం అందింది. మే 3న నిర్వహించే 57వ కమిషన్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్‌మెంట్ సదస్సులో పాల్గొననున్నారు. హేమ కుమారి 2021 లో పేకేరు గ్రామ సర్పంచిగా ఎన్నికయ్యారు. 2022 లో కాకినాడ జేఎన్‌టీయూ నుంచి ఎంటెక్ పట్టా పొందారు. 2014`19 మధ్య ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో లెక్చరర్‌గా పనిచేశారు. ఉన్నత విద్వాంతురాలైన ఈమె… విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల విషయంలో తన గ్రామంలో విశేషంగా కృషి చేస్తున్నారు.