మణిపూర్‌ అశాంతికి కారణాలు ఏమిటి?

మణిపూర్‌ ‌చిన్న రాష్ట్రం అయినా 33 తెగలు 190 భాషలను మనం ఇక్కడ చూడవచ్చు అందరి జీవనశైలి సుమారుగా ఒకే విదంగా ఉంటుంది, అందమైన ఆకుపచ్చని అరణ్యాలు ఎత్తయిన కొండలు నాట్యమాడుతునట్టుగా ఉండే సుందరమైన మణిపూర్‌లో మంటలు రగిసలిస్తుంది ఎవరు? ఆ మంటలలో చలి కాగుతున్నది ఎవరు? అక్కడ ప్రస్తుతం కుకీ, మైతేయి తెగల మధ్య ఘర్షణలతో మణిపూర్‌ ‌మూడు నెలలుగా మండుతోంది. ఈ ఘర్షణల నుండి లాభం పొందాలని ప్రయత్నిస్తున్న విదేశీ శక్తులు, అక్కడ జరుగుతున్న ఘర్షణలను మరింత రాజేసి లబ్దిపొందాలని చూస్తున్న విదేశీ శక్తులు ఎవరు? ఎందుకోసం? అనేది మనం ఒక సారి ఆలోచించాలి.

ఈ అల్లర్లు చెలరేగడనికి కారణాలను మనం పరిశీలించినప్పుడు రెండు, మూడు అంశాలు ఉన్నాయి. మైతేయిలు, కుకీలు వందల సంవత్సరా లుగా కలిసి జీవిస్తున్నారు. కొద్దిమంది కుకీలు పక్కనే ఉన్న మయన్మార్‌ ‌నుండి వచ్చిన మాట నిజమేకానీ కుకీలంతా బయటనుండి వచ్చినవారేనని చెప్పలేము.. మైతేయిలకు ఆగ్రహం రావడానికి, కుకీలలో అసంతృప్తి చెలరేగడానికి రెండు, మూడు కారణాలు ఉన్నాయి. మయన్మార్‌ ‌నుండి 50వేల మంది కుకీలు వచ్చిపడ్డారని, వాళ్ళు అడవులను ఆక్రమించుకున్నారని, మాదకద్రవ్యాల రవాణా చేస్తున్నారని, అక్రమ చొరబాటులు, తీవ్రవాద కార్యకలాపాలు సాగుతున్నాయని మైతేయిల ఆరోపణ. కుకీలకు చెందిన 27 వేర్పాటువాద సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం తమ కార్యకలాపాలు నిలిపివేస్తామని ఆ సంస్థలు అంగీకరించాయి. ఈ ఒప్పందం జరిగిన తరువాత ఈ సంస్థలకు చెందిన కార్యకర్తలు వారివారి కేంద్రాలలోనే ఉండాలి. కానీ కుకీల వైపు నుంచి అది జరగలేదు. మైతేయిలకు కూడా కె.ఎల్‌.‌ఫ్‌, ‌పి.ఎల్‌.ఏ ‌వంటి కొన్ని వేర్పాటువాద సంస్థలు ఉన్నాయి. కొంతకాలంగా తమకు ఎస్‌.‌టి హోదా ఇవ్వాలని మైతేయిలు డిమాండ్‌ ‌చేస్తున్నారు. హైకోర్ట్ ‌కూడా వారి డిమాండ్‌ ‌నెరవేర్చాలంటూ ఆదేశాలు కూడా ఇచ్చింది. కానీ వాస్తవానికి ఇలాంటి ఆదేశాలు ఇవ్వడానికి కోర్టులకు రాజ్యాంగబద్ధంగా ఎలాంటి అధికారం లేదు. ఆ అధికారం శాసన సభది. మొదట అసెంబ్లీ తీర్మానం ఆమోదిస్తుం, తరువాత రిజిస్ట్రార్‌ ‌తన ఆమోదం తెలుపుతారు, ఆ తరువాత గిరిజన కమిషన్‌ ‌ముందుకు వెళుతుంది, కమిషన్‌ ‌సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖకు విషయాన్ని నివేదిస్తుంది, మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపి రాష్ట్రపతి అనుమతి కోసం పంపుతుంది. చివరికి రాష్ట్రపతి ఆమోదంతో ఎస్‌టి హోదా లభిస్తుంది. ఇది రాజ్యాంగ పక్రియ. కోర్టు నేరుగా ఫలానా వర్గానికి ఎస్‌టి హోదా ఇవ్వాలని ఆదేశించడానికి లేదు. కేవలం సూచన చేయవచ్చును, లేదా సలహా ఇవ్వవచ్చును. అంతేకాని వారం రోజుల్లో ఎస్‌టి హోదా ప్రకటించాలని ఆదేశాలు జారీచేయడానికి వీలులేదు. కానీ కోర్టు అలా ఆదేశాలు జారీచేసింది. దానితో వేర్పాటువాద సంస్థలు, దేశవ్యతిరేక శక్తులు తెగల మధ్యన విద్వేషాలను రెచ్చగొట్టి ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ గొడవ ప్రారంభించాయి. మైతేయిలకు ఎస్‌టి హోదా ఇవ్వడానికి వీలులేదని వాదించాయి. అయితే 90శాతం భూమి 40శాతం జనాభా ఉన్న వర్గాల చేతిలో ఉందని, 50శాతం జనాభా ఉన్న తమ వద్ద 10 శాతం భూమి మాత్రమే ఉందని మైతేయిలు అంటున్నారు. ఈ విషయం నిజమే. కానీ భూమిపై హక్కు ఇవ్వడానికి అందరికీ ఎస్‌టి హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎస్‌టి హోదా మరొక పద్దతిలో కల్పించవచ్చును. ఈ విషయమై గొడవ ప్రారంభమైంది.

కుకీ జాతి నేతృత్వంలోని ఆల్‌-‌ట్రైబల్‌ ‌స్టూడెంట్స్ ‌యూనియన్‌  ‌మణిపూర్‌ (ATSUM),  2023 మే 3న ఏడు కొండ జిల్లాల్లో ‘‘గిరిజన సంఘీభావ యాత్ర’’ని నిర్వహించింది. దురదృష్టవ శాత్తు, ఈ ర్యాలీ ఇంఫాల్‌ ‌లోయకు సరిహద్దుగా ఉన్న చురాచంద్‌పూర్‌ ‌జిల్లాలో హింసాత్మకంగా మారింది. కుకీలు, మైతేయిలు కలిసి సుమారు 60వేల మంది పాల్గొన్నారు. ఈ హింస రాష్ట్రంలోని మరో పది జిల్లాలకు వేగంగా వ్యాపించింది. కొండ ప్రాంతంలోని భూమిని పొందడం, నిరాకరించడం అనే క్లిష్టమైన సమస్య సంఘర్షణకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

డ్రగ్స్ అడ్డాగా మణిపూర్‌

ఈ అల్లర్ల నేపథ్యంలో తరచుగా విస్మరించబడే మరో కీలకమైన, దాగి ఉన్న అంశం ఏమిటంటే.. ఈశాన్య ప్రాంతం ముఖ్యంగా మణిపూర్‌, ‌గత ఐదు నుండి ఏడు దశాబ్దాలలో రవాణా కేంద్రం నుండి ఉత్పత్తి కేంద్రంగా మారుతూ మాదకద్రవ్యాల వ్యాపారానికి అడ్డాగా ఎలా మారింది? ఈ ఈశాన్య ప్రాంతం థాయిలాండ్‌, ‌మయన్మార్‌, ‌చైనా, లావోస్‌లతో అంతర్జాతీయ సరిహద్దులను కలిగి ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌ ‌తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద నల్లమందు ఉత్పత్తి చేసే మయన్మార్‌కు సమీపంలో మణిపూర్‌ ఉం‌డటం మాదకద్రవ్యాల ఉత్పత్తికి, అభివృద్ధికి దోహద పడింది.

మాదకద్రవ్యాల ఉత్పత్తితో గోల్డెన్‌ ‌ట్రయాం గిల్‌గా అపఖ్యాతి పాలైన థాయిలాండ్‌, ‌మయన్మార్‌, ‌లావోస్‌ ‌సరిహద్దులను మణిపూర్‌ ‌కలిగిఉంది. పెట్రోలియం, ఆయుధాల వ్యాపారం తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద వ్యాపారంగా డ్రగ్స్ ‌పరిగణించబడుతుంది. మణిపూర్‌లో ఈ డ్రగ్స్ ‌మహమ్మారిని ఎదుర్కోవడా నికి, ముఖ్యమంత్రి బీరెన్‌ ‌సింగ్‌ 2018‌లో ‘నిషా థాడోక్లాసి’, ‘వార్‌ ఆన్‌ ‌డ్రగ్స్’ ‌ప్రచారాలను ప్రారంభించారు. నల్లమందు మొక్కలను నిర్మూలించ డానికి, నాశనం చేయడానికి ప్రతి జిల్లాలో కనీసం 100 మంది పోలీసులతో కూడిన ప్రత్యేక బృందాన్ని కూడా ఆయన కేటాయించారు.

చర్చి ఘటనలో కూడా తప్పుదారి పట్టించే కథనాన్ని ప్రచారం చేస్తున్నారు. కొన్ని క్రైస్తవ వార్తా సంస్థలు, చర్చి వివాదంలో తమను తాము బాధితులుగా చిత్రీకరిస్తున్నాయి. దాదాపు 500 చర్చిలను గుంపులు ధ్వంసం చేశాయని BBC పేర్కొంది. ఆంధప్రదేశ్‌లో సువార్తికులు విరాళాలు సేకరిస్తున్నారు. స్థానిక చర్చిలలో సంఘీభావ ప్రార్థనలలో పాల్గొనమని వారి అనుచరులను ప్రోత్సహిస్తున్నారు. వారి పరిసరాల్లో ఊరేగింపులు చేస్తున్నారు. క్రైస్తవులకు సహాయ చర్యల పేరుతో కొంతమంది సువార్తికులు మణిపూర్‌ ‌చేరుకున్నారు.

మణిపూర్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు ఏ వ్యక్తి లేదా రాజకీయ పార్టీకి ముడిపడి లేదు. ఇది కేవలం ఒక గుంపు చేస్తున్న రాద్దాంతం. అల్లర్లు సృష్టిస్తున్న కుకీల గుంపు చేతుల్లో ఆధునిక ఆయుధాలు, యంత్రాలు, చట్టవిరుద్దమైన బంకర్లను ఉండటమే కాకుండా మైతేయిలను నాశనం చేస్తామంటూ నినాదాలు చేయడం వంటి ఘటనలు సోషల్‌ ‌మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. దేశ ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారు. దీనికి తోడు స్థానిక మహిళలు కూడా దోషులను రక్షించడంతో పాటు పరిస్థితిని నియంత్రించే పనిలో ఉన్న ఆర్మీ బెటాలియన్‌లను అడ్డుకోవడం ద్వారా పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది.

ఈ పరిణామాల మధ్య  మైతేయిలకు… హోదా కల్పించాలన్న హైకోర్టు ఆదేశంతో.. మణిపూర్‌ అభివృద్ధి, శ్రేయస్సుకు విఘాతం కలిగించే శక్తులు, రాష్ట్రాన్ని శాశ్వతంగా  పేదరికంలోకి ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్ర సర్వతోముఖాభి వృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అణగదొక్క డానికి దేశంలోని మిగిలిన విద్రోహశక్తులతో వారు చేరి దేశ ప్రతిష్టను దిగజార్చడానికి కుట్రలు చేస్తున్నారు.

–  త్రిలోక్‌ , ‌కె.సురేందర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *