‘‘చికెన్ నెక్’’ ను కేంద్రానికి అప్పగించిన బెంగాల్.. చికెన్ నెక్ ఎందుకంత ప్రాధాన్యత?

దేశ భద్రత దృష్ట్యా బెంగాల్ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. చికెన్స్ నెక్ (సిలిగురి కారిడార్) లోని 120 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిర్ణయించింది. ఆ ప్రాంతంలోని 120 ఎకరాల భూమిని, జాతీయ రహదారి మార్గాలకు BSF కి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ 22 కిలోమీటర్ల ప్రాంతంపై పూర్తి పట్టు ఇప్పుడు కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయింది. సాధారణంగా ‘చికెన్ నెక్’గా పిలువబడే ఈ ఇరుకైన సిలిగురి కారిడార్, భారతదేశ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానిస్తుంది; అంతర్జాతీయ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉండటం వల్ల, దేశంలోనే అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలలో ఒకటిగా ఇది పరిగణించబడుతుంది. జాతీయ భద్రతా దృక్పథం నుండి చూస్తే, ఈ నిర్ణయం ఒక కీలక పరిణామం. సిలిగురి ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ కారిడార్, నేపాల్, భూటాన్ మరియు బంగ్లాదేశ్ దేశాల సరిహద్దుల మధ్య ఇరుకైన భూభాగంగా ఉంది;
అంతేకాకుండా, ఇది చైనాలోని టిబెట్ ప్రాంతానికి సాపేక్షంగా దగ్గరగా ఉండటం వల్ల, భారతదేశపు అత్యంత వ్యూహాత్మక సున్నిత ప్రాంతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.కొన్ని చోట్ల, ఈ కారిడార్ కేవలం 20-22 కిలోమీటర్లకు కుంచించుకుపోతుంది, దీనివల్ల ఏదైనా సైనిక లేదా భౌగోళిక రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడు ఇది వ్యూహాత్మకంగా బలహీనంగా మారుతుంది.
పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి కారిడార్ యొక్క మరోపేరు చికెన్ నెక్. కోడి మెడ ఆకారంలో ఉండటంతో ఈ ప్రాంతానికి చికెన్ నెక్ అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలను దేశంతో అనుసంధానించే ఒక సన్నని భూభాగం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి నగరం చుట్టూ ఉన్న 20 నుంచి 22 కిలోమీటర్లు ఉండే ఈ ప్రాంతం అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉంది. చికెన్‌ నెక్‌కు పశ్చిమాన నేపాల్, ఉత్తరాన్న భూటాన్, దక్షిణాన బంగ్లాదేశ్, తూర్పున ఈశాన్య రాష్ట్రాలుఉన్నాయి. ఈ ప్రాంతం డార్జిలింగ్, జల్పైగురి జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతం యొక్క భౌగోళిక ఆకృతి కారణంగా ఈ ప్రాంతానికి చికెన్ నెక్ అనే పేరు వచ్చింది. ఇండియా మ్యాప్‌లో ఈ సన్నని భూభాగం కోడి మెడ లాంటి ఆకారంలో కనిపిస్తుంది.
చికెన్ నెక్ ప్రాంతం ఈశాన్య రాష్ట్రాలకు జీవనాడిగా చెప్పుకోచ్చు. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపును దేశంతో అనుసంధానిస్తుంది. రవాణా, వాణిజ్యం, సైనిక సరఫరాలు అన్నీ ఈ మార్గం ద్వారానే జరుగుతాయి. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ సరిహద్దులతో ఉండటం వల్ల ఇది భౌగోళికంగా ప్రత్యేకమైనది. సిలిగురి నగరం వాణిజ్యం, రవాణా కేంద్రంగా ఉంది. ఇది భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లతో వాణిజ్యానికి ఒక గేట్‌వేగా పనిచేస్తుంది.
చికెన్ నెక్ భారతదేశంలో కీలకమైన ప్రాంతంగా మారడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ సన్నని కారిడార్ ఆక్రమణకు గురైతే ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంతో సంబంధం కోల్పోయే ప్రమాదం ఉంది. పటిష్ట భద్రతా చర్యలు తీసుకోకపోతే చైనా సమీపంలోని చుంబి లోయ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈప్రాంతాన్ని ఆక్రమించడం సులభమవుతుంది. చైనా ఎప్పటికైనా కొన్ని దేశా సహాయంతో ఈ ప్రాంతాన్ని ఆక్రమిస్తుందనే భయం భారతీయుల్లో నెలకొందనే చర్చ జరుగుతోంది. 2017లో డోక్లాం సంక్షోభం ఈ భయాలను మరింత పెంచింది.ఈశాన్య రాష్ట్రాలకు సరుకులు, సైనిక సామాగ్రి రవాణా కోసం ఇదే ఏకైక భూ మార్గం. రైలు, రోడ్డు రవాణా ఈ కారిడార్‌పై ఆధారపడి ఉంటుంది.
బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు ప్రధాన సమస్యగా మారింది. మాదక ద్రవ్యాలు, ఆయుధాల రవాణా వంటి సమస్యలు ఈ ప్రాంతాన్ని భద్రతా దృష్ట్యా కీలకంగా చేశాయి. ఈ ప్రాంతంలో భారత సైన్యం, అస్సాం రైఫిల్స్, BSF, SSB వంటి బలగాలు పహారా కాస్తాయి. మొత్తంగా, చికెన్ నెక్ భారతదేశ భౌగోళిక సమగ్రత, ఆర్థిక స్థిరత్వం, జాతీయ భద్రతకు ఒక మూల స్తంభం. దీని సున్నితత్వం, వ్యూహాత్మక స్థానం దాన్ని దేశంలో అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *