ఎకో ఫ్రెండ్లీ మోహిని గౌడ… స్వచ్చ మోహిని గౌడ… ప్లాస్టిక్ బదులు ఆకుల్లో పండ్ల విక్రయం

మోహినీ గౌడ… ఇప్పుడు దేశమంతా ఈమె పేరు మరింత మారుమోగిపోతోంది. ఈ భూమిని ప్లాస్టిక్  భూతం నుంచి కాపాడడానికి అవిరళ కృషి  సాగిస్తోంది. ప్రచార ఆర్భాటానికి చాలా దూరంగా వుంటూ… ప్లాస్టిక్ భూతానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పిసవ్తంది. అలాగే స్వచ్చ భారత్‌ విషయంలో కూడా దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది . మోహిని గౌడ స్థలం  కర్నాటక లోని ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలుక హాలక్కి గ్రామం. చాలా ససవత్ససాలుగా ఆమె పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది . అంకోలా బసండ్‌ ఆమె కేరాఫ్‌ అడ్రసస.

పండ్లు అమ్మడంలోనే ఆమె ప్రత్యేకత వుంది. సాధారణంగా  పండ్లను ప్లాసస్టక్‌ కవర్లరో ఇసఱ్తంటారు. కానీ మోహిని మాత్రం తన దగ్గరికి వచ్చే వినియోగదారులకు ప్లాస్టిక్ బదులుగా ఆకుల్లో విక్రయిస్తుంటుంది. అలాగే ప్రధాని మోదీ పిలుపునిచ్చిన స్వచ్చ భారత్‌ ఆమెను విపరీతంగా ఆకర్శించింది. పండ్లు తిన్నవారు అక్కడే ఆ ఆకులను కూడా పాడేయడం ఆమె శ్రద్ధగా గమనించారు. అలా చాలా సార్లు  గమనించి, తీవ్ర ఆవేదన చెందేవారు. చివరికి… ఎవరికో చెప్పడం ఎందుకు… ఆ ఆకులను తానే సేకరించి , చెత్త బుట్టలో వేయడం ప్రారంభించింది. అంతే కాకుండా దగ్గర్లో వుండే చెట్ల నుంచి రాలిన ఆకులను కూడా ఆమె శ్రద్ధగా చెత్త బుట్టలో వేస్తుంటుంది . అంతేకాకుండా చుట్టుపక్కల వుండే చెత్తా చెదారాన్ని కూడా ఆమె శుభ్రం చేస్తూ వుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *