’’ఆత్మ నిర్భర భారత్’’ సత్తా ఏమిటో ప్రపంచానికి చూపిన ‘‘ఐఎన్ఎస్ విక్రాంత్’’

భారత్ స్వదేశీ టెక్నాలజీ నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్.దేశ సముద్ర రక్షణ సామర్థ్యాన్ని మరింత బలపరచడానికి నిర్మించారు. హైలెవెల్ టెక్నాలజీతో నిర్మించిన ఈ యుద్ధ నౌకను ‘సిటీ ఆన్ ది మూవ్’ అని కూడా పిలుస్తారు. ఈ నౌకకు ‘విక్రాంత్’ అనే పేరు, దానికి ముందు ఉన్న నౌకను గౌరవించడానికి, ఆ నౌక శక్తి సామర్థ్యాలను తెలియజేయడానికి పేరు పెట్టారు. ఆ నౌక 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయానికి కీలక పాత్ర పోషించింది.
దేశంలో ఇప్పటివరకు నిర్మించిన అతి పెద్ద యుద్ధ నౌకగా ఐఎన్‌ఎస్ విక్రాంత్ నిలిచింది. ఈ నౌక పొడవు 262 మీటర్లు, వెడల్పు 62 మీటర్లు. ఇది రష్యా ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. ఈ యుద్ధనౌకలో 30 విమానాలు (ఉదా: మిగ్-29K ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు) ఉండే అంత కెపాసిటీ ఉంది. దాదాపు 1,600 మంది సిబ్బందికి వసతి ఉంటుంది. దీన్ని నిర్మించడానికి పదేళ్లకు పైగా సమయం పట్టింది. ఇందులో 16 పడకల ఆసుపత్రి, 250 ట్యాంకర్లు ఇంధనం, అలాగే 2,400 కంపార్ట్‌మెంట్లు ఉండటం విశేషం.
vikranth2
INS విక్రాంత్ అనేది విమాన వాహక నౌక. ఇది ఓడలా మాత్రమే కాకుండా సముద్రంలో తేలియడే సైనిక స్థావరంలా పనిచేస్తుంది. దీనిపై రన్‌వే కూడా ఉంటుంది. యుద్ధ విమానాలు దీనిపై ల్యాండింగ్, టేకాఫ్‌ అవుతాయి. ఈ ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ నౌక ప్రయాణించడానికి ఉపయోగించేది చోదక వ్యవస్థ. ఇందులో నాలుగు జనరల్ ఎలక్ట్రిక్ గ్యాస్‌ టర్బైన్లను ఉంటాయి. 80 మెగావాట్ల కంటే ఎక్కువ శక్తిని ఇవి విడుదల చేయగలవు. ఈ టర్బైన్ల శక్తి ద్వారానే రెండు ప్రొపెల్లర్ షాఫ్టులు తిరుగుతాయి. ఈ వ్యవస్థ సాయంతో నౌక.. గంటకు సుమారు 52 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఒకసారి ఇంధనం నింపుకున్నాక ఏకంగా 7500 మైళ్ల దూరం వరకు ప్రయాణిస్తుంది.
vikranth23
INS విక్రాంత్‌ యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను మోహరించడం, అలాగే వాటిని ఆపరేట్ చేయడం లాంటివి చేస్తుంది. దీనిపై యుద్ధ విమానాలు టేకాఫ్ అయ్యేందుకు రన్‌వే చివర కొద్దిగా పైకి వంగి స్కీజంప్‌ ర్యాంప్ ఉంటుంది. దీని నుంచి విమానం వేగంగా పైకి దూసుకెళ్లేందుకు ర్యాంప్ అదనపు శక్తిని ఇస్తుంది. దీనివల్ల యుద్ధ విమానాలకు తక్కువ దూరంలోనే గాల్లోకి ఎగరగలిగే సామార్థ్యం ఉంటుంది. విమానం తిరిగి నౌకపై ల్యాండ్ అయ్యేటప్పుడు అరెస్టర్‌ వైర్‌లు ఉంటాయి. విమానం కిందకి దిగేటప్పుడు దాని వెనుక భాగంలో ఉండే టెయిల్‌హుక్‌ ఆ వైర్లను పట్టుకుంటుంది. దీంతో అది తక్కువగ దూరంలోనే సేఫ్‌గా ల్యాండ్ అవుతుంది. ఈ నౌకపై యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను నిలిపి, మరమ్మతులు చేసి యుద్ధానికి సిద్ధం చేయొచ్చు.మరో వైపు ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ కీలక పాత్ర పోషించింది. ఇస్లామిక్ ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఓ రకంగా పాక్ కి నిద్రలేని రాత్రులనే గడిపేలా చేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీపావళి వేడుకలను గోవా తీరంలోని నౌకాదళ సిబ్బందితో కలిసి జరుపుకున్నారు. ఆదివారం రాత్రే స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కి వెళ్లిన ప్రధాని.. సోమవారం ఉదంయ నేవీ సిబ్బందితో దీపావళి జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి జవాన్లను ఉద్దేశించి ప్రసంగించారు. నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి పర్వదినం జరుపుకోవడం అదృష్టమని న్నారు. ఈ దృశ్యం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని, ఓ వైపు నాకు మహా సముద్రం, మరోవైపు భారత మాత అందించిన ధీర జవాన్ల బలం కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సముద్ర జలాలపై పడుతున్న సూర్య కిరణాలు, జవాన్లు వెలిగించిన దీపపు కాంతుల్లాగా మెరుస్తున్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *