భారత్‌ను చూస్తే వీరికి ఎందుకంత అసహనం?

తమ కంటే కూడా భారత్‌ ఎదుగుతూ ఉండటాన్ని దేశాలు ఓర్వలేకపోతున్నాయి. అందుకే తమకు అనుగుణంగా ఉంటే అనుయాయులు, వారి అనుబంధ సంస్థలతో సర్వేలు, రిపోర్టులు అంటూ కొత్త వాస్తవ దూరమైన ప్రచారానికి తెరలేపాయి. అందులో భాగంగానే దేశంలో ఆకలి కేకలు అంటూ తమ ఏజెంట్లతో చప్పుడు చేయిస్తూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలకు ఆజ్యం పోస్తున్నాయి. ఆయా కుట్రల్లో భాగమే పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌గ్యాస్‌ ‌ధరల పెంపుపై మొసలి కన్నీరు. నిత్యావసర ధరలపై, పీపీపీ విధానంపై అవగాహనలేని ప్రేలాపనలు.

ఇప్పుడు ఐఎఫ్‌ఆర్‌ఐ ‌రూపంలో అంతర్జా తీయంగా దేశాన్ని బద్నాం చేసే టూల్‌ ‌కిట్‌ ‌సిద్ధమైంది. ఐఎఫ్‌ఆర్‌ఐ అం‌టే ఇంటర్నే షనల్‌ ‌ఫుడ్‌ ‌పాలసీ రిసర్చ్ ఇనిస్టిట్యూట్‌. ఈ ‌సంస్థ ప్రతీ సంవత్సరం వివిధ దేశాలలో చిన్నపిల్లలు, పెద్దలు పౌష్టికాహారం ఎంత తీసుకుంటున్నారో సర్వే చేస్తుంది. దాని ప్రకారం వివిధ ర్యాంకులు ఇస్తూ ఉంటుంది. ఒక మూడువేల మందితో సర్వే చేస్తుంది. సమాధానాలని క్రోడీకరించి ఆయాదేశాల ర్యాంకులు నిర్ణయిస్తుంది.

హంగర్‌ ఇం‌డెక్స్ అం‌టే పౌష్టికాహార లోపం అని అర్ధం. కానీ దీనికి వాళ్ళకి అనుకూలమయిన ప్రమాణాలు అన్వయించి ర్యాంకులు ఇస్తున్నది ×ఖీ=×. అసలు పౌష్టికాహారం అంటే ఈ అమెరికన్‌ ఏజెన్సీ దృష్టిలో రోజూ కోడి గుడ్లు తీసుకోవడం, రోజూ కనీసం 100 గ్రాముల కోడి మాంసం తీసుకోవడం లేదా వేరే జంతువుల మాంసం తీసుకోవడం లాంటివి అన్నమాట! కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు తీసుకునే ఆహారంలో ఎంత శాతం ఉంటున్నాయో లెక్కగడుతుంది. అంటే వీళ్ళ లెక్కల ప్రకారం కందిపప్పు తినడం వలన ప్రోటీన్లు శరీరానికి కావలసినంతగా అందవు. మరి మన భారత్‌ ‌లో రోజూ కోడి మాసం, లేదా కోడి గుడ్లు లేదా ఇతర జంతు మాంసం తినేవారి సంఖ్య ఎంత ఉంది. అందునా పేదవాళ్లు రోజూ మాంసాహారం తినగలరా? మనదేశంలో శాకాహారులు కూడా ఉన్నారు కదా. దక్షిణాది రాష్ట్రాలతో సహా ఒరిస్సా, బెంగాల్‌, అస్సాంలలో బియ్యం ప్రధాన ఆహారంగా ఉంటుంది అంటే ఇది పౌష్టికాహార లోపమా? అలా నిర్ణయించలేరు కదా.

ఇక శ్రీలంక దేశ జనాభా శ్రీలంక జనాభా 2 కోట్ల 19 లక్షలు. ఆఫ్ఘనిస్థాన్‌ ‌జనాభా 3 కోట్ల 89 లక్షలు. పాకిస్థాన్‌ ‌జనాభా 23 కోట్ల 67 లక్షలు. పాకిస్థాన్‌ ‌జనాభా మన ఉత్తరప్రదేశ్‌ ‌రాష్ట్ర జనాభాతో సమానంగా ఉంది. శ్రీలంక జనాభా కేరళ రాష్ట్రమంత కూడా లేదు. ఆఫ్ఘనిస్థాన్‌ ‌జనాభా తెలంగాణ జనాభాతో సమానంగా ఉంది. మొత్తం యూరోపు జనాభా 74,86,75,003 కోట్లు. అంటే మన దేశ జనాభాతో పోలిస్తే సగానికి సగం ఉంది. 130 కోట్ల జనాభా ఉన్న భారత దేశంలో 3000 సాంపుల్స్ ‌తీసుకొని వాటిని ప్రామాణికంగా ఎలా పరిగణిస్తారు? అంటే రెండు కోట్ల జనాభా ఉన్న శ్రీలంక దేశంలో 3000 సాంపుల్‌ ‌సర్వే చేసి ర్యాంక్‌ ‌నిర్ణయిస్తారా ? అటువంటప్పుడు మన కేరళతో పోల్చి శ్రీలంకకి ర్యాంక్‌ ఎం‌తో నిర్ధారిం చాల్సి ఉంటుంది కదా? పాకిస్థాన్‌ ‌జనాభాతో సమానంగా ఉన్న ఉత్తర ప్రదేశ్‌ ‌జనాభాని పోల్చుతూ పాకిస్థాన్‌ ‌ర్యాంక్‌ ఎం‌తో నిర్ధారించాల్సి ఉంటుంది కదా? ఈ విషయంపైనే ఇంత మంది జనాభా ఉన్న దేశంలో కేవలం మూడువేల సాంపుల్‌తో ఎలా సర్వే చేస్తారంటూ తాజా నివేదికపై భారత్‌ అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది.

ఇక గతంలో అంటే ఓ ఆరు నెలల క్రితం అత్యంత సంతోషంగా ఉండే దేశాల లిస్ట్‌లో శ్రీలంకతో పాటు పాకిస్థాన్‌, ‌బంగ్లాదేశ్‌, ‌నేపాల్‌లని చేర్చి వాటి కంటే దిగువన భారత్‌ ఉన్నట్లు ప్రచారం చేశారు. తీరా చూస్తే శ్రీలంక, బంగ్లాదేశ్‌, ‌పాకిస్థాన్‌ ఆఫ్ఘనిస్తాన్‌ల పరిస్థితి ఈ రోజున ఎలా ఉంది అన్నది మనందరికీ తెలుసు. శ్రీలంకకి మనం బియ్యంతో పాటు పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌నోటు పుస్తకాలు ఇవ్వకపోతే రోజు గడవట్లేదు.

ఇక మందుల సంగతి సరే సరి! శ్రీలంకలో అయితే గత 10 నెలలుగా నిత్యావసర వస్తువులు దొరకక అల్లాడుతుంటే అక్కడ పౌష్టికాహార లోపం లేకుండా ఎలా ఉంటుంది? ఆఫ్ఘనిస్థాన్‌ ‌పరిస్థితి కూడా అంతే. పాకిస్థాన్‌ ‌తాజాగా 5 కోట్ల దోమ తెరలు కావాలని భారత్‌ని అభ్యర్ధించింది. మరి ఈ దేశాలు హంగర్‌ ఇం‌డెక్స్‌లో భారత్‌ ‌కంటే ఎలా పైన ఉన్నాయి? పౌష్టికాహార లోపం లేకుండా ఎలా ఉంటుంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *