విదేశాల్లో పండే బెర్రీలను మన దేశంలో పండిస్తున్న మహిళా రైతు… ఇది సక్సెస్ స్టోరీ

మన దేశంలో పండని పంటలు మన భూమిలోనే పండించాలని లని ఆ మహిళ గట్టిగా నిర్ణయించుకున్నఆరు. వృత్తిరీత్యా ఆమె న్యాయవాది. అయినా.. వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. మన దేశంలో పండని పంటలైన రాస్ప్‌బెర్రీ, బ్లూబెర్రీ, క్రాన్‌బెర్రీ లాంటి పంటలను మన నేలపై పండిరచాలని కేయా సాలోత్‌ అనే మహిళ నిర్ణయించుకున్నారు. ఇతర దేశాల్లో పండే ఈ పంటలను మన దేశంలోనూ పండిరచాలని నిర్ణయించుకున్నారు. ఆ పంటలకు అనుగుణమైన ఉష్ణోగ్రతలను మెయింటెయిన్‌ చేసింది. దీంతో అధిక దిగుబడులను సాధిస్తోంది. కేయా సాలోత్‌ ముంబై నివాసి. వృత్తిరీత్యా న్యాయవాది. వ్యవసాయ నేపథ్యం కూడా లేదు. న్యాయవాది వృత్తిలో వుండే మెళుకువలను వ్యవసాయంపైకి మళ్లిస్తే బాగుంటుందని నిర్ణయించుకున్నఆరు. అమెరికా, రష్యా, పోలండ్‌, మెక్సికో, సెర్బియా లాంటి శీతల దేశాల్లో పండే రాస్ప్‌బెర్రీ, బ్లూబెర్రీలు పండిరచాలని అనుకున్నారు. దీంతో ప్రయోగాలు ప్రారంభించింది.

ఈ పంటలను పండిరచాలని అనుకోగానే కేయాసాలోత్‌ మహారాష్ట్రలో ఏ ప్రాంతం అయితే బాగుంటుందో అధ్యయనం చేయడం ప్రారంభించారు. దీని కంటే ముందే ఈ పంటలు పండే దేశాలకు వెళ్లి, అధ్యయనం చేసి వచ్చారు. తర్వాత భారత్‌కి రాగానే 20 ఎకరాల పొలంలో వ్యవసాయం ప్రారంభించారు. అన్ని కాలాలకు తట్టుకొనే తెల్లటి పైకప్పుతో షెడ్‌ వేశారు. మొదటగా మైక్రోగ్రీన్స్‌తో ప్రారంభించారు. కొత్తిమీర, మెంతికూర, పాలకూర లాంటి స్వల్పకాల పంటలను రసాయనాలు లేకుండా పండిరచడం ప్రారంభించారు. పంట చేతికి రాగానే వివిధ షాపులకు సప్లై చేయడం ప్రారంభించారు. దీంతో అతి స్వల్ప కాలంలోనే 50కి పైగా క్లయింట్లు వచ్చేశారు. 2021 ప్రాంతంలో కియా ఇతర దేశాల్లో పండే బెర్రీలను మన దేశంలో పండిరచడానికి ఫామ్‌2 ఫామ్‌ అనే పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. సంవత్సరం తిరక్కుండానే కనీసం 135 టన్నుల బెర్రీలను ఉత్పత్తి చేశారు.

అయితే… ఇతర దేశాల్లో పండుతున్న ఈ బెర్రీలను మన దేశంలో పండిరచడానికి మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత మహారాష్ట్ర పరిస్థితులకు సరిపోయే బెర్రీ పంటల గురించి ఆమె మెక్సికో, యూరప్‌ను సందర్శించారు. 2020 లో ఆమె భారతీయ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వుండే కొన్ని మొక్కలను మొదటి దశలో దిగుమతి చేసుకున్నారు. వెంటనే 2021 లో మొదటి దిగుబడిని పొందారు.

ఉష్ణ ప్రాంతమైన మహారాష్ట్రలో ఈ బెర్రీ పంటలను పండిరచడానికి ఈమె టన్నెల్‌ సాగు పద్ధతిని అవలంబించారు. దీని ద్వారా తీవ్ర వాతావరణ పరిస్థితుల లోపాలను అధిగమించేందుకు ఈ టన్నెల్‌ సాగు పనికొచ్చింది. ప్రస్తుతానికి దేశంలో పాలీ హౌస్‌ వ్యవస్థ మాత్రమే వుంది. కానీ… మహారాష్ట్ర లాంటి అతి ఉష్ణోగ్రత వంటి ప్రాంతాల్లో టన్నెల్‌ సాగు మాత్రమే సరైందని ఆమె భావించారు. ఈ విషయాన్ని ఆమె వెల్లడిరచారు. ఉష్ణోగ్రతలను చల్లగా వుంచడానికి తాము సొంతంగా తయారు చేసుకున్న టన్నెల్‌ను వాడుతున్నాం.అవసరమైతే ప్లాస్టిక్‌ని వాడుతున్నాం. లేదంటే సాధ్యమైనంత వరకు తీసేస్తున్నారు. ఈ టన్నెల్‌తో మొక్కల పెరుగుదలకు అనువైన ఉష్ణోగ్రతలు వుంటాయి. శీతాకాలపు రాత్రులలో వెచ్చని వాతావరణాన్ని ఇస్తాయి. అలాగే వేసవి రోజులలో చల్లని పరిస్థితులు ఈ టన్నెల్స్‌ కలిపిస్తాయి. వీటితో పాటు వర్షాల నుంచి కూడా కాపాడవచ్చు. ఈ సాంకేతికత యూరోపియన్‌ దేశాలలో వుంటుంది.

తన పొలంలో 80 శాతం మొత్తం ఈ టన్నెల్స్‌ మాత్రమే వుంటాయి. అతి తక్కువ ఖర్చుతోనే వీటిని ఏర్పాటు చేశారు. ఇలా చేసి తన పొలంలో విదేశాలకు చెందిన సుమారు 7 రకాల బెర్రీలను పండిస్తున్నారు. ఎత్తైన సొరంగాల కింద బ్లూబెర్రీలను సాగుచేయడం ద్వాఆరా ఉష్ణోగ్రత తీవవ్రతల నుంచి కాపాడతాయి. అలాగే తక్కువ నీటితో పాటు, ఎక్కువ దిగుబడిని ఇస్తుందని ఆమె చెబుతోంది. ఈ టెక్నిక్‌ ద్వారా బెర్రీలు అతి తక్కువ సమయంలో పక్వానికి వస్తాయి. ఈ పద్ధతిలో నాలుగు నుంచి ఐదు నెలలలోనే దిగుబడి సాధించారు. ఈమె కృషి మూలాన విదేశాల్లో పండే బెర్రీలను ఇప్పుడు మనం మన దేశంలోనే పొందవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *