ఐక్యరాజ్యసమితిలో  మహిళా సర్పంచులు

ప్రజాసేవలో నిమగ్నమై, ప్రజలికిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తమ సేవా నిరతితో గ్రామాభి వృద్ధికి, మహిళా సాధికారతకు పాటుపడుతున్నారు ఈ మహిళా సర్పంచులు. వారిలోని ఈ నాయకత్వ లక్షణాలే వారికి ఐక్యరాజ్యసమితి సదస్సులో పాల్గొని ప్రసంగించే అరుదైన అవకాశం కల్పించాయి. ఆంధ్ర ప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా పేకేరు గ్రామ సర్పంచ్‌ కునుకు హేమకుమారి, త్రిపుర సెహెజిలా జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ సుప్రియాదాస్‌ దత్తా, రాజస్థాన్‌ అంబి అహిర్‌ గ్రామ సర్పంచ్‌ నీరూ యాదవ్‌లు ఐరాసా ఆర్థిక, సామాజిక మండలి నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో వారు తమ విజయగాథలను అక్కడి వారితో పంచుకున్నారు. కేంద్ర పంచాయితీరాజ్‌ శాఖ వీరిని ఎంపిక చేసింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ : భారతదేశ స్థానిక పాలనలో మహి ళల ముందంజ’ అనే అంశంపై మే 3న వీరు ప్రసంగించారు.

ఇవే ఆమె లక్ష్యం

ఒక మహిళ విద్యావంతురాలైతే కుటుంబం మాత్రమే కాదు సమాజం కూడా అభివృద్ధి చెందు తుంది అంటోంది కునుకు హేమకుమారి. 2022 లో జేఎన్టీయూ కాకినాడలో ఎంటెక్‌ పూర్తిచేసిన ఆమె పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం లోని పేకేరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కొన సాగుతున్నారు. 2021లో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తోన్న ఆమె తన గ్రామంలో మహి ళల్ని విద్యావంతుల్ని చేసేందుకు, అక్కడి ప్రజలకు నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఆరోగ్యం, విద్య, ఆర్థిక స్వాతంత్య్రం ఈ మూడు అంశాలను లక్ష్యాలుగా చేసుకుని తమ పరిపాలనను సాగిస్తున్నారు. ప్రస్తుతం సర్పంచ్‌గానే కాదు.. ‘మండల సర్పంచ్‌ ఛాంబర్‌’ అధ్యక్షురాలిగా, ‘జిల్లా సర్పంచ్‌ ఛాంబర్‌’ జనరల్‌ సెక్రటరీగానూ కొనసాగుతున్నారు హేమ.

మహిళల కోసం చర్చావేదికలు

ఫార్మసీలో డిప్లమా పూర్తిచేసిన సుప్రియా దాస్‌ దత్తా కేరళలోని త్రిపుర సెపాహిజాల జిల్లా పంచా యితీ అధ్యక్షురాలు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో మహిళలపై రకరకాల ఆంక్షలు ఉన్నాయి. వాళ్లు తమ సమస్యలని బయటకు కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉంది. అది బాగా గమనించిన సుప్రియా 2019లో తాను ఎన్నికైన నాటి నుంచి మహిళా సాధికారత, పేదరిక నిర్మూలన కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే మహిళల కోసం ప్రత్యేకంగా గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేదిక ద్వారా మహిళలు తమ వ్యక్తిగత సమస్యలతో పాటు తాము చేసే పనుల్లో ఎదురయ్యే సమస్యల్నీ పంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఆ సమస్యల్ని సంబం ధిత అధికారులతో చర్చించి వెంటనే పరిష్కరించేలా చొరవ చూపుతున్నారు.

హాకీ సర్పంచ్‌

నీరూయాదవ్‌ 2020లో రాజస్థాన్‌ లోని బుహానా తహసీల్‌ లోని లంబి అహిర్‌ గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికైంది. బాలికలు, మహిళల సాధికా రత కోసం నీరూ ఎంతగానో కృషి చేశారు. ఇప్పటికీ గ్రామాల్లో కొన్ని కట్టుబాట్ల కారణంగా చాలామంది అమ్మాయిలు ఇష్టం ఉన్నప్పటికీ ఆటల్ని కెరీర్‌గా ఎంచుకోలేకపోతున్నారు. అలాంటి గ్రామాలకు రాజస్థాన్‌లోని లంబి అహిర్‌ గ్రామం స్ఫూర్తిగా నిలుస్తోంది. మన జాతీయ క్రీడ హాకీ వైపు ఆసక్తి చూపే తన గ్రామంలోని బాలికల్ని ఒక టీం గా తయారుచేసి, వారికి అనుభవజ్ఞులైన కోచ్‌ల సహ కారంతో శిక్షణ ఇప్పిస్తున్నారు. వారికి ఉచితంగా హాకీ కిట్స్‌, యూనిఫాం అంది స్తున్నారు. ఈ క్రమంలోనే ‘హాకీ వాలీ సర్పంచ్‌’గా పేరు తెచ్చు కున్నారు నీరూ. ప్రస్తుతం జాగ్రఫీలో పీహెచ్‌డీ చేస్తోన్న నీరూ తన గ్రామంలోని అమ్మాయిల్ని ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహిస్తున్నారు.

మహిళల్లో ఆర్థిక అవగాహన పెంపొందించ డానికి పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. మరోవైపు ఉచితంగా శ్యానిటరీ న్యాప్‌కిన్లు అందించడం, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, బాలికల్ని విద్యతో పాటు ఆటల దిశగా ప్రోత్స హించడం, ఇలా తన గ్రామాభివృద్ధి కోసం సంపూ ర్ణంగా కృషి చేస్తున్నారామె. పర్యావరణ హితం కోరు కునే నీరూ ఇటీవలే ‘గార్బేజ్‌ ఫ్రీ మ్యారేజ్‌ ఫంక్షన్స్‌’ అనే మరో కార్యక్రమానికి తెరతీశారు. ఈ వేదికగా జీరో వేస్టేజ్‌ పద్ధతిలో పెళ్లిళ్లు చేసు కునేలా అక్కడి జంటల్ని ప్రోత్సహిస్తున్నారు. అందుకే భారత ప్రభుత్వం ఈ అరుదైన అవకాశానికి ఆమెను ఎంపిక చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *