హైదరాబాద్ వేదికగా ప్రపంచ వరి సదస్సు…. రెండు రోజుల పాటు సమాలోచన

దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌ కేంద్రంగా ప్రపంచ వరి సదస్సు జరగనుంది. జూన్‌ 7,8 తేదీల్లో హోటల్‌ తాజ్‌ కృష్ణాలో నిర్వహిస్తున్నామని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ సహకారంతో ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో 28 దేశాల నుంచి దాదాపు 500 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యాపారులు, అనుబంధ రంగాల ప్రముఖులు పాల్గొననున్నారు.మరో వైపు ఈ సదసఱ్సaలో ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌  కూడా భాగస్వామ్యం  పంచుకుంటుందని తెలిపారు. వివిధ దేశాల నుంచి వరి శాస్త్రవేత్తలు ఈ వరి సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో వరి రకాల ప్రదర్శనతో పాటు రాష్ట్రానికి  సంబంధించిన వివిధ ఉత్పత్తుల లభ్యతపై ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా మంత్రి నాగేశ్వర రావు మాట్లాడుతూ… మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి  నుంచి వచ్చే వరి ఎగుమతిదారులకు ఇది ఒక మంచి సువర్ణ  అవకాశమని అన్నారు. ఈ సదస్సులో  మన దేశీయ వరి ఎగుమతిదారులు, ఇతర దేశాల నుంచి వచ్చే ధాన్యం దిగుమతిదారులతో నేరుగా సంప్రదింపులు జరుపుకొనే అవకాశం వుంటుందన్నారు. తద్వారా మనం ఎగుమతి చేసే  వరిధాన్యం అనేది ఇతర దేశాల దిగుమతిదారులకు అనుకూలంగా వున్నాయో, లేదా అని తెలుసఱకునే అవకాశం వుంటుందని తెలిపారు.

అంతేకాకుండా అంతర్జాతీయ వరి సంస్థ నుండి పాల్గొనే శాస్త్రవేత్తల నుండి విత్తనోత్పత్తిలో అందుబాటులో ఉన్న అధునాతన పరిజ్ఞానాన్ని విత్తన పరిశ్రమ ప్రతినిధులు, అభ్యుదయ రైతులు తెలుసుకునే అవకాశాన్ని ఈ సదస్సు కల్పిస్తుంది. ఈ సదస్సులో భాగంగా దాదాపు 20 మంది విదేశీ, దేశీయ పరిశ్రమలు వారివారి ఉత్పత్తులను, ఎగుమతులకు అనుగుణమైన వరి రకాలను ప్రదర్శిస్తారు. ఈ సమాచారం ఇటు రైతులకు, దేశీయ వరి ఎగుమతిదారులకు ఎంతో ఉపయోగకరం. అందువలన మొట్టమొదటిసారిగా భారతదేశంలో నిర్వహించే ఈ ప్రపంచ వరి సదస్సులో ఇటు వరి విత్తన పరిశ్రమ ప్రతినిధులు, రైస్ మిల్లర్లు, వరి ఎగుమతిదారులతో పాటు వివిధ ఆహార ఉత్పత్తుల పరిశ్రమల ప్రతినిధులు కూడా పెద్దఎత్తున పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *