యస్య త్వేతాని చత్వారి
వానరేన్ద్ర యథా తవ
ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం
సః కర్మసు న సీదతి
భావం : ధృతి(పట్టుదల, ధైర్యం), దృష్టి (ముందు చూపు), మతి(మేధస్సు), దాక్ష్యం (శక్తి సామర్థ్యాలు) అనే ఈ నాలుగు గుణాలు ఎవరు తమ పనుల్లో చూపుతారో వారికి జీవితంలో ఓటమి అనేదే ఉండదు.