యథా ఖనన్ ఖనిత్రేణ
నరో వార్యధిగచ్చతి ।
తథా గురుగతాం విద్యాం
శుశ్రూష రధిగచ్చతి ॥
భావం : గునపంతో భూమిని త్రవ్వి నీటిని ఎలాగ పొందుతున్నామో, అలాగే గురువును నిరంతరం సేవిస్తూ విద్యను పొందాలి. భూమిలో నిటిని పొందడానికి కష్టపడినట్లే విద్య ను పొందడానికి కృషి చేయాలి.