అల్మారాలో పంటలు పండిస్తున్న రైతు… హైడ్రోఫోనిక్ కల్చర్ తో కొత్త ప్రయోగాలు

మన ఇంట్లో వుండే అల్మారాల్లో మనం నగలు దాచుకుంటాం. లేదంటే బట్టలు పెట్టుకుంటాం. వీటితో పాటు వివిధ వస్తువులను దాచుకుంటాం. కానీ… తమిళనాడుకి చెందిన శ్రవణన్‌ అనే రైతు అల్మారాల్లో పంటలను పండిస్తున్నారు. అల్మారాల్లో ఆర్గానిక్‌ పంటలను పండిస్తూ ఉత్తమమైన రైతుగా వార్తల్లోకెక్కారు. దీనినే ‘‘హైడ్రోఫోనిక్‌ కల్చర్‌’’ అంటారు. అంటే నీటితో పంటలు పండిస్తారు. హైడ్రోఫోనిక్‌ కల్చర్‌లో కూరగాయలు పండిరచే వారు, గడ్డిని పెంచుతారు. దీనికి సంబంధించిన సామాగ్రిని ఇంటి పైకప్పు మీద ఏర్పాటు చేసుకుంటారు. శరవణన్‌ అదే ప్రయత్నాన్ని మొక్కజొన్న పంటలను ఒక అల్మారాలో చేసి చూపించాడు. శరవణన్‌ ప్రయోగాన్ని రైతులకు మొడల్‌గా చూపించింది అక్కడి కృషి విజ్ఞాన్‌ కేంద్రం. షెల్ఫ్‌ అరల్లో దశల వారీగా మొక్కజొన్న గింజలను వేస్తూ యేడాదంతా పాడి పశువులకు పచ్చిగడ్డి అందేలా రూపకల్పన చేశారు శరవణన్‌. రైతులకు సౌకర్యంగా వుండేలా ఓ కిట్‌ను రూపొందించారు.

నిజానికి ఈ శరవణన్‌ రైతు కుంటుంబంలో జన్మించారు. వాళ్ల తాతలు అనేక రకాల మందులతో కూడిన వ్యవసాయం చేసేవారు. తను కూడా కొన్ని రోజులు అదే బాటలోనే నడిచాడు. కానీ 2005 లో ప్రభుత్వం మైక్రో ఇరిగేషన్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద డ్రిప్‌ మరియు స్ప్రింక్లర్స్‌ ఇరిగేషన్‌ కోసం రాయితీలు ఇచ్చారు. దీంతో శరవణన్‌ రసాయనిక ఎరువుల వ్యవసాయం కాకుండా, బిందు సేద్యం, ఆర్గానిక్‌ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు.

దీంతో స్థానికంగా వుండే కృషి విజ్ఞాన్‌ కేంద్రంలో వివిధ శిక్షణలు తీసుకున్నారు. దాని తర్వాత వివిధ ఆవిష్కరణలు చేయడం ప్రారంభించాడు. చీడపీడలను అరికట్టడానికి, పంటలు సమృద్ధిగా పండడానికి ఆర్గానిక్‌ బాటపట్టాడు. దీంతో అతి తక్కువ సమయంలోనే ఆయనను అనేక అవార్డులు లభించాయి. అధికారికంగా సేంద్రీయ రైతుగా నిలబడ్డాడు.

తన వ్యవసాయంలో పూర్తిగా రసాయనాలను వాడటం ఆపేశాడు. బిందు సేద్యం, వర్మి కంపోస్ట్‌, బయోగ్యాస్‌ యూనిట్‌ ఏర్పాటు చేయడం, హైడ్రోపోనిక్స్‌ వైపు మళ్లాడు. తన పశువులకు సరైన మేత లభించకపోవడంతో ఆయన హైడ్రోపోనిక్‌ పద్ధతిలో మొక్కజొన్న ఉత్పత్తిని ప్రారంభించారు. 2018 నుంచి అతను తన పశువులకు మేత కోసం ఈ పద్ధతిని వాడుతున్నాడు. దీని పద్ధతే మొక్కజొన్న పశుగ్రాసాన్ని అల్మారాలో పెంచడం. మట్టి లేకుండా హైడ్రోపోనిక్‌ పద్ధతిని ఉపయోగిస్తున్నాడు. 2007 నుంచి శరవణనÊ తన 6 ఎకరాల భూమిలో పసుపు, వేరుశెనగతో పాటు కూరగాయలను బిందు సేద్యం ద్వారా చేస్తున్నాడు. అంతేకాకుండా ఆక్వాకల్చర్‌, పౌల్ట్రీని కూడా చేస్తున్నారు.

 

మొదట సాధారణ రైతుగా ప్రయాణం ప్రారంభమై, సమగ్ర వ్యవసాయ రైతుగా అభివృద్ధి చెందాడు. అయితే బిందు సేద్యం ప్రారంభించిన సమయానికి భూసార పరీక్ష చేసుకున్నాడు. నేల అంత ఆరోగ్యంగా లేదని, పాస్పరస్‌ స్థాయిలు పెరుగుతున్నాయని, చెడిపోతోందని పరీక్షలో తేలింది. అదే సమయంలో తన పసుపు పంటలకు వ్యాధులు కూడా సోకినట్లు గుర్తించారు. దీంతో స్థానిక కృషి కేంద్రం అధికారులు సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లాలని, దీంతో నష్టాన్ని నివారించవచ్చని శరవణ్‌కి సూచించారు. దీంతో ఆయన మెళ్లిగా 2008 నుంచి నెమ్మదిగా రసాయనిక ఎరువులు, పురుగు మందులను వాడడం మానేశాడు. పంట మార్పిడి కూడా చేశారు.

2018 లో నామక్కల్‌లోని ఆవిన్‌ డెయిరీ కో ఆపరేటివ్‌ సంస్థ శరవణ్‌కి హైడ్రోపోనిక్స్‌ యూనిట్‌ను ఇచ్చి, ప్రోత్సహించింది. హైడ్రోపోనిక్స్‌ అనేది కొత్త తరహా పద్ధతి. అతి తక్కువ నేల, అతి తక్కువ నీటితో మొక్కలను పెంచే సాంకేతికత దీని సొంతం. దీని ద్వారా పశుగ్రాసం, తృణధ్యానాలు, పపృా ధాన్యాలను పండిస్తున్నాడు. 500 గ్రాముల మొక్కజొన్న నాటడం ద్వారా 8 రోజుల వ్యవధిలో 5 కిలోల మొక్కజొన్న మేతను ఉత్పత్తి చేస్తున్నారు. ఇందులో ట్రేలను సూర్యరశ్శికి కాస్త దూరంగా వుంచాలి. కాబట్టి శరవణన్‌ అల్మారాలను ఎంచుకున్నారు. అల్మారాల్లో అద్భుతంగా పంటలను పండిస్తున్నాడు. ఇతర రైతులను కూడా ఈ హైడ్రోపోనిక్స్‌ వైపు మళ్లిస్తున్నారు.

హైడ్రోపోనిక్స్‌ యూనిట్‌ని ఉపయోగించి, మొక్కజొన్న పశుగ్రాసాన్ని పెంచే దశలను ఇలా వివరిస్తున్నారు.
1. గింజలను కడిగి 24 గంటలు నానబెట్టాలి.
2. విత్తనాలను గోనె సంచిలో కట్టి 24 గంటల పాటు నీటిలో వుంచాలి.
3. మొలకెత్తిన విత్తనాలను ఒక ట్రేకి బదిలీ చేయాలి. దానిని అల్మారాలో వుంచాలి.
4. ప్రతీ మూడు గంటలకు ఓసారి మాన్యువల్‌ గా, లేదా 7 రోజుల పాటు టైమర్‌తో స్ప్రింక్లర్‌తో నీటిని వాడాలి.
5. 8వ రోజు దిగుబడి సిద్ధంగా వుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *